భారత స్వాతంత్ర వీరుడు, నేతాజీ, ఆజాద్ హిందూ ఫౌజ్ దలపతీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత కారు డ్రైవర్ ఇంకా బతికే ఉన్నారు. ఇటీవల నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను మోడీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం  మనందరికీ విదితమే. ఇప్పటికీ ఆయన మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయన మరణం వీడని మిస్టరీగా మారింది. ఇటీవల దశలవారీగా విడుదల చేసిన ధస్త్రాల్లో ఆయన మరణానికి సంబంధించిన ఏవైనా రహస్య సమాచారం కొంతైనా దొరుకుతుందని అంతా ఉహించారు.

 

కానీ వారి పటాపంచలు చేస్తూ ఆ దస్త్రాల్లో మరణానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదు. నేతాజీ మృతిపై ఎన్ని అనుమానాలున్నా, నేతాజీ డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్ మాత్రం అరుదైన ఘనతను సాధించారు. నేతాజీ డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్ ఈ భూమిపై బ్రతికి ఉన్న అత్యధిక వయసుగల వ్యక్తి గా రికార్డ్ లిఖించారు. ఈ మధ్యనే 116 సంవత్సర పడిలోకి నిజాముద్దీన్ అడుగుపెట్టారు.

 

 అతని ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, బ్యాంకుకు సమర్పించిన ప్రూఫ్ ల ఆధారంగా ఇప్పటికి నిజాముద్దీన్ వయసు 116 సంవత్సరాల 3 నెలల పై మాటే. నిజాముద్దీన్ 1900 లో జన్మించినట్లు సమాచారం. 114 ఏళ్ల జపాన్ కు చెందిన వ్యక్తి చనిపోవడంతో ఆ రికార్డు ఇప్పుడు నిజాముద్దీన్ కు చేరింది. ఇక్కడ విచిత్రమేమిటంటే నిజాముద్దీన్ భార్య అజ్భున్నిసా వయసు 107 సంవత్సరాలట.  నేతాజీ డ్రైవర్ ఇప్పటికీ బతికే ఉన్నాడనే విషయం తెలుసుకున్న ప్రజలు ఇది ఎలా సాధ్యం అని ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: