ఈరోజుల్లో గ్యాస్ తో బాధపడే వారిసంఖ్య రోజురోజుకీ బాగా పెరిగి పోతోంది. ఈసమస్యకు సంబంధించి మందులు వేసుకున్నా ఆమందులు కంటే కూడ మనం ఆచరించే చిట్కాలు వల్ల ఈగ్యాస్ట్రిక్ సమస్య నుండి శాస్వితంగా నివారణ పొందవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం. కడుపులో మంట, పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. గ్యాస్ వల్లపొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది, అపనవాయువుతో ఇబ్బంది కుడా కలుగుతుంది . 

కడుపులో గ్యాస్ ఆపుకుందామంటే ఆగదు. ఆపితే విపరీతమైన నొప్పి, వాసన ఉంటే భరించడం కష్టం. దీని నుండీ బయటపడడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ గ్యాస్ సమస్య మన శరీరంలో ఏర్పడటానికి మన అలావాట్లే ప్రధాన కారణం. మనం తినే ఆహారం. నమలకుండా గబగబా మింగడం. మాట్లాడుతూ తినడం. నోరు ఎక్కువగా తెరచి నమలడం. బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. 

అంతేకాదు స్మోక్ చేయడం వల్ల ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. మరి గ్యాస్ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి. ధూమపానం, జర్దా, పాన్ వంటివి తినకూడదు. కొన్ని వ్యాయామ పద్ధతులు పాటించాలి. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకి భోజనం చేయాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి. 

ఈ గ్యాస్ సమస్యల నుండి బయట పడటానికి ధనియాలు నమలడం వల్ల ఈసమస్య బాగా తగ్గుతుంది.  కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అదేవిధంగా తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల తర్వాత త్రాగితే ఈ సమస్య నుండి ఉపసమనం కలుగుతుంది. రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.  మరొక చిట్కాగా తులసి ఆకులు నమిలితే కడుపులో గ్యాస్ ఏర్పడదు. ఇలా చిన్నచిన్న చిట్కాలతో ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుండి హాయిగా బయటపడవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: