సమ్మర్ వచ్చింది అంటే ఎక్కడ చూసినా పచ్చి మామిడి  కాయలు  మామిడి పళ్ళు కనిపించని ఊరు కానీ ప్రాంతం కాని ఉండదు. పసందైన పులుపుతో నోరూరించే పచ్చిమామిడి రుచికరంగానే కాదు ఆరోగ్యానికి కూడ ఎంతో మంచిదని అనేక అధ్యయానాలు చెపుతున్నాయి. ఇందులో చాలా పోషకవిలువలు ఉంటాయని నిపుణులు చెపుతున్నారు. 

పచ్చిమామిడి కాయ తినడం వల్ల అనేక చర్మ సమస్యలతో పాటు, రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ఒక విధంగా పండిన మామిడి కంటే పచ్చి మామిడి తినడమే ఆరోగ్యకరం అంటున్నారు. పచ్చిమామిడి పవర్ ఫుల్ కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అలాగే  మన శరీరంలోని ఫ్లూయిడ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటిక్ పేషంట్స్ కి పచ్చిమామిడి మంచి ఫ్రూట్. దీన్ని పెరుగు, రైస్ తో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అని చెపుతున్నారు. 

పచ్చిమామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చిమామిడికాయలు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది అని అంటున్నారు. పచ్చిమామిడి తినడం వల్ల క్యాలరీలు కరగడానికి సహాయపడుతుంది. పచ్చిమామిడి కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఎసిడిటీతో బాధ పడేవారికి పచ్చి మామిడి చక్కటి పరిష్కారం. ఒక ముక్క పచ్చిమామిడిని నములుతూ ఉండటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. 

వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి మన  డైట్ లో పచ్చిమామిడి చేర్చుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలతో కూడిన ఈ పచ్చి మామిడి కాయలను ఈ సీజన్ లో వీలైనంత ఎక్కువగా తింటే అన్ని విధాల మంచిది అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: