అమ్మాయిలకు చదువు, ఉద్యోగం తర్వాత పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే.. పెళ్లి గురించి చాలా మంది అమ్మాయిలు క్రేజీగా ఫీలయితే.. మరికొంత మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. ఎలాంటి భర్త వస్తాడో.. తనని, తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడో అన్న అయోమయం వెంటాడుతూ ఉంటుంది. కానీ.. కాబోయే వాడి గురించి కలలు కంటూ ఉంటారు. అందం, పర్సనాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా.. తన మెంటాలిటీ గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


లవ్ మ్యారేజ్ అయితే.. పార్టనర్ గురించి కొంత అవగాహన ఉంటుంది. అభిరుచులు, అలవాట్లు, అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవచ్చు. కానీ.. అరేంజ్ మ్యారేజ్ అయితే.. కొత్త వ్యక్తితో జీవితం పంచుకోవాల్సి ఉంటుంది.

 

అతని గురించి ఏమాత్రం తెలిసే అవకాశముండదు. కానీ.. నిశ్చితార్థం అయ్యాక.. ఖచ్చితంగా సమయం ఉంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఇదే.. సరైన టైం. మూడుముళ్లు, ఏడడుగులు వేశాక పెళ్లైయిపోయినట్లే. అప్పుడు ఆ బంధం బలపడినట్టే. అయితే చిన్న చిన్న మనస్పర్ధలకే అనేకమంది విడిపోతున్నారు. భార్యభర్తల అభిరుచులు వేరుగా ఉండటం, సర్దుకుపోయే తత్వం కరువవడంతో ఇలా పెళ్లిళ్లు ఫెయిల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఒకరి తప్పులు ఒకరు వేలెత్తిచూపడం వల్ల ఇలా గొడవలతో మూడు ముళ్ల బంధానికి చరమగీతం పాడుతున్నారు. ఇలాంటివి జరగకూడదంటే.. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి అలవాట్లు మరొకరు తెలుసుకోవాలి.

 

అప్పుడే పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యా ఉండదు. గొడవలు ఉండవు. లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. ఇంతకీ పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి ? ఏయే విషయాలు ఇద్దరి లైఫ్ హ్యాపీగా మార్చేస్థాయి ? లెట్స్ హావ్ ఎ లుక్.. ఇష్టాయిష్టాలు అభిరుచులు, అలవాట్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద సమస్య. ఎందుకంటే.. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకొచ్చేవి. కొంతమంది ఎదుటివ్యక్తి చెప్పే ఏ విషయాన్నీ అంగీకరించరు. అలాగే.. తాము చెప్పేదే కరెక్ట్ అని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఎదుటివాళ్లు నిరుత్సాహపడతారు. అలాగే.. వ్యతిరేఖతా భావం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ మీరు చేసుకోబోయే వాళ్లలో ఉన్నాయా అని గమనించండి. ఒకవేళ మీకు ఇష్టంలేని ప్రవర్తన కనిపిస్తే.. మార్చుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఫ్యూచర్ లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి.


కోపం విషయంలో :  కోపం.. ఇది ప్రతి రిలేషన్ ఇరిటేషన్ తెప్పించే ఫీలింగ్. ఇది అందరికీ ఉండేదే.. కానీ.. మరీ ఎక్కువగా ఉంటే.. ఏ రిలేషన్ లోనూ సక్సెస్ కాలేరు. ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటున్నారు అంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏం మాట్లాడినా కోపడ్డటం, కసురుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎదుటివ్యక్తికి చికాకు వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఈ ధోరణి గుర్తించారంటే.. వెంటనే కోపం తగ్గించడానికి ప్రయత్నించాలి. నిర్లక్ష్యం భార్యాభర్తలు అంటే.. ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోవాలి. ప్రతి విషయం షేర్ చేసుకోవాలి. ప్రతి ఫీలింగ్ పంచుకోవాలి. ఒకరికిఒకరై జీవించాలి. కానీ.. కొంతమంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఏదైనా పనిలో నిమగ్నమైతే.. పార్టనర్ గురించి పట్టించుకోరు. కానీ.. అలా కాకుండా.. ఎక్కడ ఉన్నా.. నేను నిన్ను మరవను అన్న ఫీలింగ్ మీ భాగస్వామికి కల్పించాలి. ఎక్కడ ఉన్నా.. మీ పార్టనర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని పట్టించుకోవడం చాలా అవసరం.


సపోర్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ పై చక్కటి అవగాహన ఉండాలి. ఇద్దరి లక్ష్యాలు వేరువేరుగా ఉండవచ్చు. లేదా ఒకేలా ఉండవచ్చు. కానీ పెళ్లి తర్వాత ఒకరి లక్ష్యాలను ఒకరు గౌరవించాలి. ఇద్దరూ కలిసినిర్ణయం తీసుకోవాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ ఆలోచనలకు మీ పార్టనర్ విలువనిస్తున్నారా లేదా అన్న విషయం గమనించాలి. మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే చెప్పాలి. అప్పుడే.. మీ మ్యారేజ్ లైఫ్ లవ్లీగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: