*పాంచాలి,  పాండవుల భార్య ద్రౌపది కి మరో పేరు. ఈమె పగ ప్రతీకార జ్వాలే జంబూ ద్వీపాన్ని, భారత ఉపఖండాన్ని కురుక్షేత్ర యుద్దం వైపు నడిపించింది. 27 అక్షౌహిణుల భారత సైన్యం ఈ యుద్దగ్ని జ్వాలల్లో ఆహుతైంది. జనహనన్మంటే చరిత్రకు,  ప్రజలకు తెలిసొచ్చిన సందర్భానికి ఆజ్యంపోసింది ఒక ఆడదాని ప్రతీకార కాంక్షే. అయితే ఈ ద్రౌపది కి ఫ్లాష్-బాక్లో అనేక జన్మలున్నాయి. అనేక జన్మల విమోచనానికే ఆమె దృపద రాజపుత్రి గా జన్మించింది. అనేకమంది దేవతలు ఐదుగురు భర్తలకు భార్యవై వెలుగొందుతావని ఆమెకిచ్చిన వరమే ఆమెను పాంచాలిని (ఐదుగురు వీరుల ధర్మపత్ని) గా చేసింది.



మహా సతీమ తల్లి సీతను రావణాసురుడు అపహరించగలడని ఊహించిన అగ్ని దేవుడు రామలక్ష్మణుల అంగీకారముతో సీతను తన సంరక్షణలో దాచి, ఆమే నీడను మాయాసీతగా మార్చేస్తాడు. ఆ మాయా సీతనే రావణుడు అపహరించి అశోకవనములో ఉంచుతాడు. ఈ మాయా సీత రావణవధ అనంతరం శ్రీరాముని ఆశీస్సులతో శివుని కోసం ఘోర తపస్సు చెసి ప్రత్యక్షమైన శివుని  మెప్పించి వరప్రదాయినై "భర్తకావాలని ఐదుసార్లు" వరాల్ని కోరుకొంటుంది. అనుగ్రహించిన శివుడు రానున్న జన్మలో దృపద రాజపుత్రివై ఐదుగురు మహాశక్తివంతులైన భర్తలకు ధర్మపత్నివై కీర్తి ప్రతిష్టలు పొందుతావని వరమిస్తాడు. ఫలితంగా ఆమె తరవాత జన్మ ద్వాపరయుగము లో "ద్రౌపది" గా జన్మించి పంచపాండవుల పత్ని "పాంచాలి" అవుతుంది.


 

*నీలాయణి,  అను పేరుతో జన్మించి,  మౌద్గల్య మహషి భార్య అవుతుంది ఇది మరొకథ  ఏమంటే?  వార్ధక్యములో కుష్టు వ్యాది సోకినా తన పతిని సతీ ధర్మముతో సేవిస్తూ ఆయన భుజించి వదలిన ఆహారాన్ని తినేటప్పుడతని చేతివేలు ఆహారములో పడ్డా,  ఆ అహారాన్ని అసహ్యించుకోకుండా ఆ వేలును వదలి ఆహారాన్ని భుజించి పతివ్రతా ధర్మాన్ని పాటిస్తుంది. మెచ్చిన ఆ మహర్షి తన భార్యను ఏదైనా వరం కోరుకొమ్మంటాదు. అచేతనుడైన ఆ పతి సాహచర్యములో దైహిక సంతృప్తి పొందని నీలాయణి తనను అందమైన యువకుడై ఐదు రూపాల్లో తనను రమించమని, సంతృప్తి యిమ్మని కోరుతుంది. అలా ప్రయత్నించి విఫలుడైన మౌద్గల్యుడు మరుజన్మలో మహోన్నతులు, అందగాళ్ళైన యువకులైదుగురిని పతులుగా పొంది నీవిప్పుడు కోరిన కాంక్షలు తనివితీరా తీర్చుకోగలవని వరమిచ్చిన ఫలితమే మరుజన్మలో పాంచాలి అవుతుంది.  అందగాళ్ళు, యోధాన యోధులైన భర్తలతో జీవిత కాంక్షలను నెరవేర్చుకొని ప్రతి సంగమానంతరము కూడా కన్యగానే తరవాత పతివ్రతగానే మిగిలిపోతుంది. ఇది మౌద్గల్యుని వర ప్రభావమే.


*ఇంద్రసేన ఒక శివ భక్తురాలు, శివుడు తన సేవలో ఉన్న ఈమెకు గంగా జననం వద్ద ఒక అందమైన యువకుడు ఉంటాడు అతనిని తీసురమ్మని అదేశిస్తాదు. అతడే  ఇంద్రుడు, ఏదో దైవకార్యార్ధము అచట ఉన్న ఇంద్రునికి  గంగా ప్రవాహములో బంగారు పుష్పాలు రావటం గమనించి,  ఆవైపుకు వెళ్ళి కొంతదూరం ప్రయాణించగా గంగా జననం వడ్డ ఇంద్రసేన ఎదురుచూస్తూ ఉంటుంది, ఇంద్రుని రాకతో శివునివద్దకు తీసుకువెళ్ళే సరికి అక్కద శివపార్వతులు పాచికలాడుతూ కనిపిస్తారు. ఆ విషయము తెలియక వారి ఏకాంతానికి భంగము కలిగించానన్న భయముతో ప్రక్కనున్న గుహలో దాక్కుంటాడు ఇంద్రుడు,  గమనించిన శివుడు సంస్కారవిహీనంగా తమ ఏకాంతాన్ని భంగపరచినదుకు అతనిని వెంటాడతాడు,  తప్పుచేసిన భయంతో గుహలో దాగిఉంటానికి ప్రయత్నిస్తాడు ఇంద్రుడు. ఈ విధంగానే అప్పటికే నలుగురు నీలాంటి ఇంద్రులు గుహలో ఉన్నారు చూడండని అంటాడు. ఇంద్రుడు ఆశ్చర్య పోతాడు. అప్పటికే నలుగురు ఉండి తనతో ఐదుగురు అవుతారు. ఈ పాపపరిహారార్ధం మానవజన్మెత్తి తమ భక్తురాలుకి భర్తలై శాపవిమోచనం పొందమని శాపాన్ని- వరాన్ని సంయుక్తంగా ఇస్తాడు.  మరుజన్మలో ఇంద్రసమానులైన ఈ ఐడుగురు భర్తలతో సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తూ తన కాంక్షలను నిజం చేసుకుంటుంది పాంచాలి ఉరఫ్ ద్రౌపతి.


ఇవి ద్రౌపది గురించిన ప్రచారములో ఉన్న గత జన్మ కథలు.  ఇంతమంది భర్తలతో సంసారం చేసినా ద్రౌపతికి పంచకన్యల జాబితాలో స్థానం లభించటానికి కారణం మౌద్గల్య మహర్షి ఇచ్చిన వరమే. “అహల్యః, ద్రౌపది, సీత, మండోదరి, తార తథః పంచకన్యః,  స్మరేన్నిత్యం  మహాపాతకనాశినః”  వీరు పంచకన్యలు గా ప్రసిద్దికెక్కారు.  వీరిని స్మరిస్తే పాపంవినాశన మౌతుందంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: