కుంకుమ పువ్వు వాడటం వల్ల మన ఆరోగ్యానికి వచ్చే ప్రయోజనాలు తెలుసు కుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల కుంకుమ పువ్వులు అవసరమవుతాయి కాబట్టి దీని ధర మార్కెట్ లో చాల అధికంగా ఉంటుంది. అయితే ఈ కుంకుమ పువ్వు వాడకం వల్ల ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే ఖరీదు గురించి ఎవరు ఆలోచించారు. కుంకుమ పువ్వు కాస్త చేదుగా తియ్యగా మంచి సువాసన కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. 

కేవలం గర్భిణీ స్ర్తీలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో మన పూర్వీకులు కాలం నుంచి ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తున్నారు. కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి. కుంకుమ పువ్వును ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లోఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ కారణాలు వల్ల కుంకుమ పువ్వును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ పువ్వు వాడకం వల్ల ఆకలి పెరుగుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . కొన్ని కుంకుమ పువ్వు రేకులను అందంకోసం కూడ ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలను, కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ముఖంలో రక్తప్రసరణ పెరిగి, గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే తేనె కుంకుమ పువ్వు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం మంచిది . కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారించడంతో పాటు దీని వాడకం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. తులసి, కుంకుమపువ్వు కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలికుంకుమ పువ్వు ఉపయోగించి హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.

అంతేకాదు దీని వాడకం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. స్టమక్ అల్సర్, లేదా పెప్టిక్ అల్సర్ ను నివారించడంలో కుంకుమ పువ్వు గొప్పగా సహాయపడుతుంది. కుంకుమ పువ్వును వేడి పాలలో వేసి బాగా కలబెట్టి, గోరువెచ్చగా త్రాగితే గుండెలో మంటి లేదా అసిడిక్ రిఫ్లెక్షన్ తో బాధపడే వారికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.  ఈ పువ్వు వాడకం వల్ల  జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం థెరఫియాటిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుండి కూడ ఈ కుంకుమ పువ్వు రక్షిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: