తెలుగు వారి సాంప్రదాయంలో శనగలకు ప్రముఖ స్థానం ఉంది.  పూజలకు స్త్రీలకు సంబంధించిన వ్రతాలు నోములకు విషయాలలో కూడ ఈ శనగలకు అగ్ర స్థానం ఉంది. దేవాలయాలలో శనగలు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే ఈ శనగలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. శనగల్లో మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కలిగి ఉన్నాయి.

ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పీచు చక్కెరను నియంత్రిస్తుంది. శనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్, ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాడతాయి. అదేవిధంగా క్యాన్సర్ కారకాలను శనగలు  నాశనం చేస్తాయి. 

రక్తపోటు తో బాధపడే వాళ్లు రెగ్యులర్ డైట్ లో శనగలు చేర్చుకోవడం మంచిది. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి. నానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. శనగల్లో గుండెకు అధిక బలం చేకూర్చే గుణం ఉంది. అంతేకాదు ఇవి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అవటానికి కూడా తోడ్పడతాయి. శనగల్లో ఫ్యాట్ కరిగించే గుణం కూడా మెండుగా ఉంది అని అంటారు. 

వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ర్టాల్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా శనగలలో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్ బ్లడ్ సెల్స్ పనితీరుకి సహాయపడతాయి. రుతుక్రమం సమయంలో స్ర్తీలకు వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలకు మంచి పరిష్కారం ఇది. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న శనగలను మన ఆహారంలో వీలైనంత ఎక్కువగా తరుచు రకరకాలుగా తయారుచేసుకుని తీసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చును..


మరింత సమాచారం తెలుసుకోండి: