పండ్లలో రారాజు మామిడిపండు అని అంటారు. అయితే అటు వంటి తియ్యటి పళ్ళను అందించే మామిడి చెట్టు ఆకులను తోరణాలుగా మార్చి మన ఇంటిలో జరిగే శుభ కార్యాలకు సంకేతంగా ప్రతి సందర్భంలో ఉపయోగిస్తాము. అయితే చెక్కర శాతం ఎక్కుగా ఉండే మామిడి పండ్లను షుగర్ పేషెంట్లు దూరం పెట్టవలిసి వస్తూ ఉంటే అదే షుగర్ పేషెంట్లకు ఈ మామిడి ఆకులు ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు. మామిడి ఆకులలోని ఆరోగ్య రహస్యాలు చాలా మందికి తెలియవు. 

వీటిని ఉపయోగించడం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టే   అనాది కాలం నుండి ఈ మామిడి ఆకులను మనం ఉపయోగిస్తున్నం అనుకోవాలి. దీనివెనక సైంటిఫిక్ రీజన్స్ ఉండటం వల్ల మామిడాలకును తప్పనిసరిగా గుమ్మాలకు కడతారు.  ఈ మామిడాకులకు డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేసే సత్తా ఉంది అని పరిశోధనలు చేపుతున్నాయి. అసలు మామిడాకులను డయాబెటిస్ నివారించడానికి ఎలా ఉపయోగించాలి, వీటిలో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. 

మామిడి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటానికి మామిడాకులు ఉపయోగపడతాయి. ఆస్తమా నుంచి ఉపశమనం కలగడానికి మామిడి ఆకులు సహాయపడతాయి. అలాగే శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి. మామిడాకులను చైనీస్ మెడిసిన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రకరకాల మెడిసినల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మామిడాకులు రకరకాల వ్యాధులను నివారిస్తాయి. జీర్ణసంబంధ సమస్యలు, ట్యూమర్స్ తో పోరాడే శక్తి మామిడాకుల్లో దాగుంది. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సింట్స్ గుణాలు పుష్కలంగా  ఉన్నాయి. 

మామిడాకులను కాల్చి ఆ పొగ ద్వారా గొంతు ఇన్ఫెక్షన్స్, నొప్పి, ఎక్కిళ్లు నివారించడానికి సహాయపడుతుంది. లేత మామిడి ఆకులు తీసుకుని ఒక గిన్నె నీటిలో ఉడికించి వడకట్టి ఆ నీటిని తాగాలి. దీని వల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. లేత మామిడి ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి.. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ కలిపితాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది అని పరిశోధనలు చెపుతున్నాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పండుగ వచ్చింది అంటే చాలు మన గుమ్మాలకు మామిడి ఆకుల హడావిడి కనిపిస్తుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: