దక్షిణ  కొరియా రచయిత్రి  హాన్ కాంగ్ (45)  2016 సంవత్సరానికి  గాను "మాన్ బూకర్ అంతర్జాతీయ అవార్ద్"    £ 50000/-  అంటే సుమారుగా Rs. 48.25  లక్షల  రూపాయిలను  తన కొరియా  రచన - ది వెజెటేరియన్ -  ఇంగ్లిష్ లోకి అనువదించిన డెబోరా స్మిత్ (28) తో కలసి పంచుకుంటొంది. రచయిత్రి దక్షిణ కొరియా లో,  ‘సియోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్”  లో,  ‘సృజనాత్మక రచన’ ల  విభా గం లో  విజయవంతమైన టీచర్.



డెబోరా స్మిత్ -  హాన్ కాంగ్ 



ఈ విధంగా ట్రాన్సులేటర్ తో కలిపి రైటర్ కు ఈ అవార్డ్ ఇవ్వటం ఇదే తొలి సారి.  ఈ  బూకెర్ ప్రైస్ ను  సాహిత్యంలో ప్రపంచ వ్యాప్తంగా గౌరవిస్తారు.  మానవ జాతి లొ  విశ్వవ్యాప్తమౌతున్న కృరత్వానికి మరియు  ప్రకృతి పట్ల, తోటి జీవరాశుల పట్ల  విలుప్త మౌతున్న విలువలకి -   ప్రతిగా  ఇతివృత్తాన్ని - గేయ గీతిక (రూపకం)    ( lyrical and  lacerating)  -  మార్చి ఆ వేదనను ,  హృదయానికి హత్తుకొనేలా ఈ సాహితీ సుమాన్ని రచయిత్రి పాఠకులకు అందించారు.  ఈ కొరియన్ అద్భుత సాహితీ సుమాన్ని అంతకంటే సాహితీ సొగసు చెడకుండా మూడు భాగాలు గా  ఆంగ్లీకరించారు అనువాదకురాలు.


తెలుగులో  వెలువడ్డ  గొప్ప గేయ గీతిక (రూపకం) జంద్యాల పాపయ్య శాస్త్రి (కరుణ శ్రీ) గారి పుష్ప విలాపం - దీని సినీ గాయకుడు ఘంటసాల గారు అద్భుతంగా పాడారు.  అలాగే నోబెల్ బహుమతి పొందిన బెంగాలి రచన రవీంద్రనాద్ ఠాగోర్ "గీతాంజలి" విభాగంలోకే వస్తాయి. గతం లో ఈ ప్రైజులు  "సల్మాన్ రష్డీ - మిడ్నైట్ -చిల్డ్రెన్: అరుందతీ రాయ్ - ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్: కిరణ్ దేశాయ్-ది ఇన్-హెరిటెన్స్ అఫ్ లాస్: అరవింద్ అడిగ - ది వైట్ టైగర్" భారతీయ రచయిత(తృ)ల కు లభించాయి. 

 

ఈనాడు మానవ జాతిని విశ్వవ్యాప్తం గా వదలకుండా చీడలా పట్టుకున్న, త్రిదుర్గుణాలు....అవినీతి, భెషజం, కౄరత్వం. ఇందులో జీవులే తమ తోటి జీవరాసి అంతానికి ప్రోది చేసే కౄరత్వాన్ని నిరసిస్తూ పఠితల హృదయములో ఆర్ధ్రత పొంగించిన రచనే ఈ ఆణిముత్యం  "ది-వెజిటేరీయన్" ఇందులో (ప్రొటగోనిష్ట్-ప్రవక్త)  “యాంగ్ హై” అనే మహిళ  తనకు తాను ఒక మొక్క గా పుట్టాలని కోరుకుంటుంది. అలాగే మానవ జాతి మనసులోని లోని అంధకారాన్ని చూసి తనను తాను రక్షించుకోవటానికి ఈ జాతి నివసించే ఆవాసాలను వదలి పోవటానికి సిద్ధపడుతుంది. మనిషి కావటములోని ఔచిత్యాన్ని (being human ) ఆర్ధ్రతతో తనను తానే ప్రశ్నించు కుంటుంది రచయిత్రి - ఈ గేయ గీతికలో.   "హృదయంలో చిందే మృదు భావనకు వెలుపల ప్రపంచంలో విప్పారే భీతి" సమ్న్వయం లేని కారుణ్యరహిత వాతావరణములో నలిగి వ్యధ చెందే ప్రకృతి ఆవేదనే గేయగీతికలోని నేపధ్యం అని రచయిత్రి, అనువాదకు రాలు, జడ్జెస్ కమిటీ చైర్మాన్ బోయిడ్ టోంకిన్ చెప్పారు.


150 విశ్వవ్యాప్త రచనలనుండి  ఐదుగురు జడ్జెస్ ఏరుకున్న ఆణిముత్యాలు ఆరు. వాటినుండి మరీ వెతికితీసిన మేలు మణే ఈ ది-వెజెటేరియన్.   ఇటలీ సాహితీ సంచలనమైన ఏలీనా ఫెర్రాంట్ (ది స్టోరీ ఆఫ్ లాస్ట్ చైల్ద్), టర్కీ ప్రఖ్యాత రచయిత ఓర్హాం పాముక్  (ది స్ట్రేంజ్-నెస్ ఆఫ్ మై మైండ్) లాంటి ప్రముఖులు పోటీ  పడ్డారు. తుదకు ఈ పోరాటంలో తమ తొలి రచనా  ప్రయోగం తోనే   ఈ ఇద్దరు మహిళామణుల ను విజయం  అంతర్జాతీయ ఖ్యాతి వరించింది. 2005 లో ప్రారంభమైన ఈ  మన్ బూకర్ ప్రైజ్  బ్రిటిష్ రచనల కోసం నిర్దేశించినా,  తరువాత వాటిని రచయిత - అనువాద రచయితకు కలిపి బహుమతి ఇచ్చే సంప్రదాయం దీనితోనే ప్రారంభించారు. ఈ ప్రైజ్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో  ఒక సునామీ సృష్టించ వచ్చు. 

 

ఈ అనువాదానికి ఉపక్రమించటానికి ముందు మూడు సంవత్సరాలలో కొరియన్ భాషను, సాహిత్యం సాంప్రదాయం లో ఇమిడిఉన్న సున్నితత్వం ఘాడతతో సహా నేర్చుకున్నారు అనువాద రచయిత్రి ఆ కృషిని  గుర్తిస్తూ ఈ అవార్డ్ ను ఇద్దరికి సంయుక్తంగా ప్రదానం చేశారు. సాహితీ సాగర మధనంలో తనెంతో అద్భుతమైన అనుభవాన్ని పొందానని అది అనితర సాధ్యమని అనువాద రచయిత్రి అనారు. దాంతో అనువాదాన్ని గూడా పురస్కరించినట్లైంది మన్ బూకర్ కు.

Image result for man booker prize 2016 images

మరింత సమాచారం తెలుసుకోండి: