మనకు పరిపూర్ణమైన ఆహారంగా పాలను తీసుకోవడం పసి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు సాధారణమైన విషయం. అయితే అత్యంత పోషక విలువలు ఉన్న ఈ పాలను కోల్డ్ మిల్క్ గా తీసుకుంటే మంచిదా లేదంటే వేడి పాలను తీసుకుంటే మంచిదా అనే విషయం పై ఇప్పటికీ రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే పరిశోధనలు మాత్రం కోల్డ్ మిల్క్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. చల్లటి పాలు త్రాగటం వల్ల పాలలో ఉండే పోషక విలువలు అన్నీ మన శరీరానికి అందుతాయి అన్న ఉద్దేశ్యంతో కోల్డ్ మిల్క్ ను  బ్రేక్ ఫాస్ట్, లంచ్, లేదా డిన్నర్ లో తీసుకోమని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. 

పాలలో సహజ సిద్ధంగా ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ మినిరల్స్ తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, బి, డి లు కోల్డ్ మిల్క్ ద్వారా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. ముఖ్యంగా పాలలో ఉండే క్యాల్షియం, దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి వాటి పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతాయి. అయితే ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, గొర్రెపాలు, ఒంటె పాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రమంచిది అని అంటున్నారు. 

దీనివల్ల మనo ఏ పాలు తీసుకున్నా వాటిలో ఉండే పోషక విలువలు ఏ మాత్రం తగ్గవు అని అంటారు. కాని ఎక్కువగా మనం అంతా గేదె మరియు ఆవుపాలను మాత్రమే తీసుకుంటాం. మన గ్యులర్ డైట్ లో పాలు చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి సరిపడా న్యూట్రీషియన్స్ అందివ్వడంతో పాటు బరువు తగ్గించడంలో చాల సహాయపడుతాయి. షుగర్ చేర్చిన పానియాల కంటే నేచురల్ మిల్క్ తో శరీరానికి అత్యంత ప్రయోజనం. ఈ క్రమంలోనే చల్లటి పాలు తాగడం వల్ల బరువు తగ్గించడంలో చాల సహాయపడుతుంది. 

అంతేకాదు మన  బాడీలోని  క్యాలరీలను కరిగించి నార్మల్ స్థితికి తీసుకు రావడానికి ఈ కోల్డ్ మిల్క్ ఎంతగానో ప్రయోజన కారి.  చల్లటి పాలు తాగడం వల్ల ఎసిడిటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చల్లటి పాలు తాగడం వల్ల పెప్టిక్ అల్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న కోల్డ్ మిల్క్ ను త్రాగడం ఇష్టం లేకపోతే రకరకాల పళ్ళతో మిల్క్ షేక్ లు చేసుకుని మనం తరుచూ తీసుకుంటు ఉంటే అసలు అనారోగ్యం మన దరికి రాదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: