భారతీయ సంస్కృతిలో పసుపుకు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు మన ఇంటిలో చేసుకునే వంటల నుండి పూజల వరకు పసుపు ప్రాధాన్యత లేని సందర్భం ఉండదు. అందుకే దీనిని ప్రకృతి ప్రసాదించిన మహా దినుసుగా గుర్తిస్తూ ఉంటారు.  ఇక మనకు శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుండ్లకు నివారిణిగా పసుపును ఉపయోగిస్తూ ఉంటాం. మన గాయాల పై దీనిని రాయడం వల్ల  సూక్ష్మక్రిములు దరిచేరవు. ఇక పసుపును మన దేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. 

బౌద్ధ భిక్షువులు  రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. 

పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది. నీళ్ళ లో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి ఈ నీళ్లు త్రాగితే కొలెస్టిరాల్ ను, రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది. జామ ఆకులు పసుపు తో కలిపి నూరిన మిశ్రమాన్ని మొఖనికి రాయడం వలన మొటిమలు తగ్గుతాయి. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి. వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

పసుపు వాడకం వలన పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్‌ ఎక్కువ తాగే వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది. క్యాన్సర్‌ను చంపే గుణం ఒక్క పసుపులోనే ఎక్కువగా ఉంది. పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో కాన్సర్‌ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్‌ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి పసుపుకు మాత్రమే ఉంది. ఇలా అనేక ప్రయోజనాలు గల పసుపును మనం ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలం..


మరింత సమాచారం తెలుసుకోండి: