ఆవకాయ పచ్చడి లేని తెలుగు వారి ఇల్లు ఉండదు. ఆవకాయ లేకుండా భోజనం పూర్తి చేయని వారు ఉండరు. తెలుగు భాష మాట్లాడే వారు ఎందరో ఉన్నా ఈ ఆవకాయ పచ్చడి విషయంలో తెలుగు వారికి పచ్చడి అంటే తెలియంది కాదు. అందరూ ఒకే భాష మాట్లాడినప్పటికీ ఆయా ప్రాంతాల యాస స్పష్టంగా కనపడుతుంది. అలాగే, ఆవకాయ  పచ్చడి విషయంలోనూ ప్రాంతాల వారీగా, పిలిచే పేరుతో పాటు తయారుచేసే విధానంలోనూ మనకు కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఈ పచ్చళ్లు నిలువ ఉండడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో విధాలైన విటమిన్లు మల్టిఫ్లై అవుతాయి. ఇంతకీ పచ్చళ్లలో కలిపే దినుసులలో ఉండే ఆరోగ్య విలువలు ఏమిటో తెలుసుకుందాం. 

ఆవాలు లేకుండా ఆవకాయ ఉండదు. ఆవాలు జీర్ణశక్తిని పెంచుతాయి. వర్షాకాలం, చలికాలంలో వేడిని కలిగించి జలుబు నుండి రక్షిస్తాయి. అందుకే, ఆవకాయను వర్షాకాలంలో వ్యవసాయ పశువులకు పెడతారు. ఇది శరీరంలోని నీరసాన్ని పోగొట్టి ఆకలిని పుట్టిస్తుంది. అదేవిధంగా మెంతులు ఆవకాయలో కలవడం వలన మన శరీరానికి చలువనిస్తాయి. అంతేకాదు ఈ మెంతులు వలన మధుమేహ వ్యాధి తగ్గుతుందని వైద్య నిపుణులు తెలియచేసారు. 

పేరు ఏదైనా రుచేవేరు వివిధ పద్ధతుల్లోఆవకాయను తయారు చేస్తూ ఉంటారు. మామిడి ముక్కలతో చేసేదాన్ని అవకాయ, మాగాయ అని, మామిడి కోరుతో చేసేదాన్ని మామిడి ఊరగాయ అనీ అంటారు. మామిడికాయతో పాటు నిమ్మ, దబ్బ, ఉసిరి, గోంగూర, చింతకాయ, పండుమిరప, ఉల్లి, వెల్లుల్లి, టమాట వంటి వాటితోనూ ఊరగాయలు పెడ తారు. ఇవన్నీ కూడా తరతరాలుగా తెలుగు వాళ్లు వాడుతున్నారు. ఇవేకాక ఈ మధ్య దోస, క్యారట్, కాలిఫ్లవర్ వంటి వాటిని కూడా ఊరగాయలుగా పెడుతున్నారు. కేవలం పండ్లు, కూరగాయలే కాకుండా మాంసం, చేపలతో కూడా పచ్చళ్లు పెడుతు న్నారు. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, రొయ్య పచ్చడి, చేప పచ్చడి ఇలా ప్రతీది పచ్చడిగా చేస్తున్నారు. 

అయితే, ఈ పచ్చడి పెట్టే విధానాన్ని కనిపెట్టింది మాత్రం మన తెలుగువాళ్లే. అవకాయ, మాగాయ, గోంగూర వంటి ఊరగాయలు తయారు చేసే పద్ధతులైతే ఖచ్చితంగా మనవే. ఇది మన వారి నైపుణ్యానికి నిదర్శనం. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ ఆచారానికి మరింత పదును పెట్టి దేశమంతటా విస్తరించేలా చేసింది కూడా మన వాళ్ళే.
అయితే ఈ ఆవకాయ పచ్చడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అని కొన్ని అపోహలు కూడ ఉన్నాయి. నిజానికి అలాంటి భయం అవసరం లేదు. రోజూ తగిన మెతాదులో ఊరగాయ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని, మనిషి చలాకీగా, సరదాగా ఉంటాడని పలు వైద్య పరి శోధనలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆవకాయ పచ్చడి అంటే అంత ఇష్టం..



మరింత సమాచారం తెలుసుకోండి: