చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో కాదు ఎప్పుడైనా ఎవరికైనా తినాలనిపిస్తుంది. అటువంటి కీరాదోసకాయ జ్యూస్ లో అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఈ జ్యూస్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పుష్కలమైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారంగా తీసుకోవచ్చు. 

స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో ఈ జ్యూస్ చక్కని పాత్ర పోషిస్తుంది.  రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. ఈ జ్యూస్ లో విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. మన కళ్ళ కింద నల్లటి చారలను తొలగించడంలో ఈ జ్యూస్ అమోఘంగా పనిచేస్తుంది.  శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్ , సిలికాన్ , దోహదపడి జుట్టు ను ఆరోగ్యం గా ఉంచుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ జ్యూస్ కడుపులోని  మంటను తగ్గించడమే కాకుండా జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. 

మనం ప్రతిరోజు తీసుకునే డైట్ లో ఈ జ్యూస్ ను చేర్చుకోవడం వల్ల న్యాచురల్ క్లెన్సర్ లా పనిచేస్తూ మన శరీరంలోని మలినాలు బయటకు పోవడానికి ఎంతో సహకరిస్తుంది. దోసకాయలోని తొక్కలోని, పండులోనూ అనేక హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. విటమిన్ కె, సి, ఏలతో పాటు పొటాషియం, క్యాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి. 

దోసకాయ జ్యూస్ లో క్యాన్సర్ రిస్క్ తగ్గించే సత్తా ఉంది. ఆడవాళ్లలో లో వచ్చే బ్రెస్ట్, గర్భాశయం, ఒవేరియన్ క్యాన్సర్లను అరికడుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ ను త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: