ప్రస్తుతం ప్రపంచ మానవాళిని వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒక పెనుభుతంగా మారింది. ఒకసారి ఈ వ్యాధి బారిన పడ్డ మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వ్యాధి నుండి పూర్తిగా బయట పడలేక పోతున్నాడు. చాలామందిని ఈరోజు పీడిస్తున్న ఈ  టైప్ 2 డయాబెటిస్ నివారణకు కొన్ని నెచురల్ రెమిడీస్ ఉన్నాయి. 

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కొన్ని నెచురల్ రెమిడీస్ పాటిస్తే కొంత వరకు ఈ టైప్ 2 డయాబిటీస్ ను కొంత వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు అని పరిశోధనలు చెపుతున్నాయి.  ఈ నెచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈవిధంగా ఉన్నాయి రెండు మూడు వేపాకులను ప్రతిరోజు నోట్లో వేసుకుని నమిలి మింగడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబిటీస్ నియంత్రణలోకి వచ్చే ఆస్కారం ఉంది. 

అదేవిధంగా ఇండియన్ గూస్బెర్రీగా పిలవబడే ఆమ్లాను పౌడర్ రూపoలో గోరువెచ్చని నీటితో పరగడుపున తీసుకుంటే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని అనేకమంది చెపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ టైప్ 2 డయాబిటీస్ కు మంచి నివారిణిగా చెప్పబడే  కాకరకాయ రసంలో  ఫైటోన్యూట్రీయంట్స్ అధికంగా ఉండటంతో ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కాలేయం, మజిల్స్ వంటి ఇతర బాగాలకు అందేలా చేస్తుంది. 

డయాబెటిక్ పేషంట్స్ లో ఉన్న ఇన్సులిన్ లెవల్స్ సమస్యకు ఈ కాకరకాయ రసం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఆయుర్వేదంలో బాగా పాపులర్ అయిన పానాక్స్ జన్సింగ్ వేర్లు లేదా పండ్లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిoచడానికి బాగా సహకరిస్థాయి. పురాతన కాలం నుండి వాడకంలో గుర్ మర్ మొక్క ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలితే దీనివల్ల కూడ ఈ వ్యాధి కంట్రోల్ లో ఉండే ఆస్కారం ఉంది. ఇలా ఈ నెచురల్ రెమిడీస్ లో మనకు నచ్చిన ఏ రెమిడీని ఫాలో అయినా ఈ టైప్ 2 డయాబిటీస్ ను కొంత వరకు నియంత్రించే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: