తాజాగా జరిపిన ఒక అధ్యయనం లో బయటపడిన నిజాలు కంగారు పెట్టిస్తున్నాయి. మగాళ్ళు ఎంత 'వీక్' గా ఉంటారు అనే విషయం లో ఈ సర్వే ఆసక్తికర ఫలితాలు అందించింది. డిజిటల్ ప్రపంచం లో మొబైల్ ఫోన్ ని నమ్ముకుని బతుకుతున్న జనాలు స్మార్ట్ ఫోన్ లేనిదే ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. ఉదయం లేవడమే సెల్ ఫోన్ తో కాపురం చేస్తున్న మనోళ్ళు రాత్రి పడుకునే ముందు పెళ్ళాన్ని పలకరించినా పలకరించక పోయినా సెల్ ఫోన్ తో సమయం మాత్రం తప్పనిసరిగా గడుపుతున్నారు.

 

ఈ స్మార్ట్ ఫోన్ పిచ్చి లో ఆడవారికంటే మగవారు ఎక్కువగా కాన్సంట్రేట్ అయ్యి ఉన్నారు అని ఈ అధ్యయనం చెబుతోంది. జర్మనీ లోని  వుర్జ్ బర్గ్ వర్సిటీ.. బ్రిటన్ లోని నొట్టింగమ్.. ట్రెంట్ వర్సిటీకి చెందిన వారు అంతా కలిసి చేపట్టిన ఈ అధ్యయనం లో మొబైల్ ఫోన్ కి దూరంగా ఉండే మగాళ్ళు చాలా వీక్ గా ఉన్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ మగాళ్ళు కేవలం 21 సెకన్లు మాత్రమే దూరంగా ఉండగలుగుతూ ఉండగా ఆడవారు కనీసం ఒక నిమిషం అంటే యాభై ఏడు సెకన్ల పాటు దూరంగా ఉండగలుగుతున్నారట.

ఇద్దరి మధ్యనా వ్యత్యాసం సెకన్లలో అయినా దాదాపు డబల్ రేంజ్ లో ఇద్దరి మధ్యనా సమయం గ్యాప్ ఉండడం తో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఇరు జెండర్ లనీ స్మార్ట్ ఫోన్ తన కబంద హస్తాలతో ఎంతగా ఇబ్బంది పెడుతోంది అని ఈ సర్వే క్లియర్ గా తేల్చేసింది.

 

వ్యసనం అయిపొయింది :

 

 స్మార్ట్ ఫోన్ లు మన జీవితం లోకి ఎంతగా తొంగి చూస్తున్నాయి, మన ప్రైవసీ ని ఎంతగా చంపేస్తున్నాయి అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. 21 సెకెన్ల పాటు , 57 సెకెన్ల పాటూ సెల్ ఫోన్ ని చూడలేని పరిస్థితి లో జనాలు మునిగిపోయారు అంటే వారు తమ స్మార్ట్ ఫోన్ ల వలన  ఎంత ఒత్తిడి కి గురి అవుతున్నారు అనేది ఈ అధ్యయనం లో తేలడం గమనార్హం. ఇప్పటికైనా మన ముందు తరాల వారికైనా ఇది ఒక వ్యసనంగా మారకుండా ఉండాలి అని కోరుకుందాము. చిన్న తనం నుంచే పిల్లలకి సెల్ ఫోన్ లు అప్పజెప్పడం లాంటివి మానేయడం బెటర్ ఏమో ఆలోచించండి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: