ఉదయం లేవగానే కుర్రకారు చేసే మొట్ట మొదటి పని ఏంటి ? బాత్ రూమ్ కి వెళ్ళడమా  ? బ్రష్ చేసుకోవడమా ? ఇవేమీ కాదు మొట్టమొదట గా ఫోన్ ఓపెన్ చేసి ఫేస్ బుక్ లో దూరడం. అంతగా ఇంటర్నెట్ జనాలని కవ్విస్తోంది ఇప్పుడు. ఎప్పుడు చూసినా ఇంటర్నెట్ లో ఫేస్ బుక్, ట్విట్టర్,  ఇన్ స్టాగ్రామ్ - పింట్రెస్ట్ - టంబ్లర్ ల... గోలే  ఇలా ప్రతి సోషల్ మీడియా సైట్ యువతకు హాట్ ఫేవరెట్.

అయితే ఇప్పుడు జరిగిన కొత్త అధ్యయనం ప్రకారం ఈ యువత లో ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ నెట్వర్కింగ్ లో ఎక్కువగా ఉండేది అమ్మయిలేనట. పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిల సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువగా చేస్తున్నారు అని మొన్నటి వరకూ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియా లో కూడా వారి యూసేజ్ పెరిగింది అని ఈ అధ్యయనం చెబుతోంది.

ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న అమ్మాయిల శాతం 76గా ఉందని తేలింది. ట్విట్టర్ వాడకంలోనూ ఫీమేల్ యూజర్లదే పైచేయి అట.  ఇతరేతర ఇంస్టా గ్రామ్ లాంటి వాటిల్లో కూడా ఇదే పరిస్థితి. అమెరికా లో వీటి అన్నిటికీ అంటే ప్రతీ యాప్ నీ ప్రతీ వెబ్సైటు నీ చూసేవారి సంఖ్య దాదాపు కోటి పైనే. సాంకేతిక విషయం లో కూడా భారత్ లో మొన్నటి వరకూ లింగ వివక్ష ఉండేది గానీ ఇప్పుడు అవేమీ లేనట్టు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: