శారీర ధర్మమైన తుమ్ములను ఏకారణం చేతో అలాచూడక దానికి ఏదో ప్రత్యేకతలు అంటగట్టేశారు మనవాళ్ళు. ప్రపంచ వ్యాప్తంగా కూడా తుమ్ముపై చాలా అభిప్రాయాలున్నాయి. ఏదైనా పని మొదలు పెట్టేసమయములో ఎవరైనా తుమ్మితే ఆ పనికి విఘ్నం కలుగుతుందని నమ్మటం మనం చూస్తూనే ఉన్నాం. దీనిలో ఇంకో తిరకాసుంది. వెంట వెంటనే ఎవరైనా రెండు తుమ్ములు తుమ్మితే ఒక దానికొకటి చెల్లు అయి చెడుపరిణామాలు జరగవని మాథమాటిక్స్ సూత్రాలను దీనికి జోడించారు.

 

మనదేశము లో ఎవరైనా తుమ్మితే పెద్దవాళ్ళు "చిరంజీవా!" అంటారు.

అదే రష్యాలో ఐతే" భ్యూద్జ్యరోవ్ " అంటారు దానర్ధం "ఆరోగ్యవంతుడవై జీవించు" అని.

యూరప్ అంతటా "దేవుడు నిన్ను రక్షించు గాక" అనే అర్ధంవచ్చే దీవనలే ఇస్తారు.

కుడివైపు తిరిగి తుమ్మితే మంచి శకునమని - ఎడమవైపు తిరిగి తుమ్మితే చెడు శకునమని రోమనుల నమ్మకం.


దీన్ని బట్తి తుమ్ము రాబొయ్యే అనర్ధాన్ని సూచిస్తుందన్న మాట.

రాబొయ్యే జలుబుకు తుమ్ము ఒక సంకేతం. మందులు వాడితే వారం, వాడక పోతే ఏడు రోజుల్లో తగ్గే జలుబుకు ఇంత టెన్షన్, అటెన్షన్ ఎందుకు?


అంటే తుమ్ము రావటం ప్లేగు జబ్బు రావటానికి సంకేతమని గ్రీకులు భావించటమే. ఆరవ శతాబ్ధంలో గ్రీక్ ఇటలీలో పోప్  గ్రేగరీ ప్లేగ్ వ్యాపించటానికి ముందు తుమ్మిన వాడి క్షేమం కోసం "గాడ్ బ్లెస్ యూ" అనవలసిందని ప్తజలకు ఆదేశాలిచ్చాడు. అప్పటినుండే తుమ్మినవాణ్ణి గాడ్ బ్లె యూ అని దీవించటం ఆచారమైంది.

 

తుమ్మినప్పుడు ముక్కులోనుంచి - నోట్లోని గాలిని బలంగా తోసేయటం అసంకల్పితంగా జరుగుతుంది. ముక్కులోని శ్లేష్మపు పొర కు అనుసందానించి ఉన్న నరాల కొనబాగాలు ఉత్తేజితమై ప్రకంపిస్తాయి. అదే తుమ్ముకు కారణం. అలాగే ఒక్క సారిగా అధిక ప్రకాశవంతమైన సూర్య కాంతితో కూడస ముక్కులోని నరాలు స్పందించి తుమ్ములు రావటం గమనిస్తుంటాము. జలుబు శ్లెష్మపు పొర వాయటం తుమ్ములకు ప్రేరణ అవుతుంది. పుప్పొడి, దుమ్ము, ధూళి, దోమలు ముక్కులోకి దూరితే వాటిని బయటకు నెట్టటానికి మనదేహం తుమ్మును రక్షా కవచంగా వాడుకుంటూ శరీరాన్ని కాపాడు కోవటానికి ఇచ్చే ప్రతిస్పందనే తుమ్ము.  తుమ్మినప్పుడు బయటకు వచ్చే అసంఖ్యాక క్రిములు ఇతరుల శరీరములోకి చేరి జలుబును వ్యాపింపచేస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: