నిత్యం మనం తినే ఆహార పదార్థాలు ముఖ్యంగా మూలికలకు సంబంధించి..ఆకులకు సంబంధించిన వాటిలో ఎన్నో ఔషదాలు దాగిఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని ఆకుల్లో అద్భుతమైన ఔషదాలు ఉన్నాయి..తులసి,వేప,కరివేపాకు,మునగ, పొన్నగంటి ఆకు ఇలా ఎన్నో మనం తినే ఆకుల్లో ఆరోగ్యానికి సంబందించినవి ఉన్నాయి. కొన్ని ఆకులు అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ అహ్లాదాన్ని ఇస్తుంటాయి. బిర్యానీ ఆకు కొన్ని చోట్ల బగారు  దీన్నే ఇంగ్లీష్ లో  బే లీఫ్ అని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు.


ఈ ఆకును ఉపయోగించడం వలన బిర్యానికి మంచి వాసన వస్తుంది.  ఆ ఆకు వేయగానే చుట్టు పక్కల వారికి అద్భుతమైన సువాసన వస్తుంది..వెంటనే మీ ఇంట్లో ఈ రోజు స్పెషల్ చేస్తున్నారా అని అడగడం కామన్. అయితే ఈ ఆకు కేవలం వంటల్లోనే కాకుండా ఇంట్లో ఎలాంది దుర్గంధం వస్తున్నా దాన్ని నుంచి ఉపశమనం పొందడానికి బిర్యానీ ఆకు కాల్చి రూమ్ తలుపులు పూర్తిగా గడియవేయండి.


10 నిమిషాల వరకు ఉంచి తర్వాత ఆ ఇంట్లోకి వెళ్తే చ‌క్కని వాస‌న వ‌స్తుంది.. దీంతో మీ మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న అంతా మటుమాయం అవుతుంది.  అంతే కాదు దోమ‌ల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: