శ‌న‌గ‌పప్పును మ‌నం అనేక వంట‌కాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను లేదా లావుగా ఉండే మ‌రో ర‌క‌మైన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు కలిగే ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు తెలుసు కుంటే పచ్చి శనగల వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో తెలుస్తుంది.  ఈ పచ్చి శనగలు తినే అలవాటు వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.  

శ‌న‌గ‌ల్లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి వేస్తుంది. దీనితో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు అని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు.  మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ తో సమానంగా శనగలలో ప్రోటీన్స్ ఉంటాయి అన్న విషయం చాల కొద్ది మందికి మాత్రమే తెలుసు.

పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ర‌కాల మిన‌ర‌ల్స్ శ‌న‌గల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శ‌న‌గ‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని డైటీషియన్స్ కూడ చెపుతున్నారు.

శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేసే ఆహారం.  శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. 

దీనివల్ల నిద్ర లేమి సమస్య నుండి బయట పడి బాగా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి శనగలు వల్ల  కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.  
ఐర‌న్‌, ప్రోటీన్లు, మిన‌ర‌ల్స్‌  స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌న‌గ‌లు శరీరానికి మంచి శ‌క్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండ‌డం వ‌ల్ల మన శరీరంలో రోగనిరోధక వ్య‌వ‌స్థ బాగా ప‌టిష్ట‌మ‌వుతుంది.

పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది. దీనితో మన ఎముక‌లు దృఢంగా ఉంటాయి.  ఈ శనగలు తినడం వల్ల కిడ్నీల ప‌నితనం మెరుగు ప‌డుతుంది. ప‌చ్చ కామెర్లు ఉన్న వారు శ‌న‌గ‌ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు.  అంతేకాకుండా చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొలగించడంలో శనగల ఆహారం ఎంతో మేలు చేస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: