అరటిపండు దొరకని ప్రాంతం అంటూ ఉండదు.  సాధారణంగా అందరికి అందుబాటులో ఉండే ఈ అరటిపండు వల్ల మనకు లభించే ప్రయోజనాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఈపండు తినకుండా ఉండలేరు.  మనలోని ఆకలిని తగ్గించుకోవడానికి ఈ అరటిపండు బాగా పనిచేస్తుంది. అయితే అరటి పండులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ అరటిపండులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ రోజుకి ఒక అరటిపండు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. పెరిగిన శరీర బరువును తగ్గించుకోవడానికి బనానా డైట్ ను ఫాలో అయితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అరటిపండులో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేని ఫ్రూట్. అందుకే అరటిపండ్లను డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. దీన్ని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే మచ్చలు ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 

అయితే మచ్చలు ఉండే అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను అరికడుతుంది అని పరిశోధనలు ఇప్పటికే తెలియచేసాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తినడానికి ప్రయత్నించడం చాలమంచిది.  ఇలా ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే హార్ట్ బర్న్ సమస్య, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో తో బాధపడుతున్న వారికి వెంటనే ఉపసమనం కలుగుతుంది. 

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. బోవెల్ మూవ్ మెంట్ ని తేలిక చేస్తుంది. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అరటిపండ్లు స్టామినా, ఎనర్జీని రోజంతా అందిస్తాయి. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది అని అనేక పరిశోధనలు తెలియచేసాయి.

ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే.. ఎలాంటి జీర్ణసంబంధ సమస్యలు దరిచేరవు. ఈ పండు తినే అలవాటు వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి, శరీరానికి బ్లడ్ సరఫరా అవడానికి సహాయపడుతుంది. అరటిపండ్లు గ్యాస్ట్రిక్ జ్యూస్ లు తొలగించి.. ఎసిడిటీని నివారిస్తాయి. పొట్టలో అనారోగ్యాన్ని, ఇరిటేషన్ ని తగ్గించడంలో, బ్యాక్టీరియాతో పోరాడటంలో.. అరటిపండ్లు అమోఘంగా పనిచేస్తాయి. అంతేకాదు ఈ అరటిపండు తినే అలవాటు వల్ల కంటి చూపు సమస్యలు రావు.  ఇలా అనేక ప్రయోజనాలు ఈ అరటి పండులో మెండుగా ఉండటం వల్ల ఈ పండును సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు..  


మరింత సమాచారం తెలుసుకోండి: