ప్రతిరోజు ఉద‌యాన్నే వ్యాయామం చేసి తమ బాడీని కంట్రోల్ లో పెట్టుకోవాలి అని ఎంతోమంది ఆలోచనలు అయితే చేస్తారు కాని తెల్లవారగానే ఆ ఆలోచనలు వాస్తవ రూపంలో తీసుకు వచ్చే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు.  అయితే వారి బద్దకాన్ని మటుమాయం చేసి వారికి మంచి హెల్దీ ఫిజిక్ ఇచ్చే అంశంగా వేడినీళ్ళ స్నానం మారింది అంటే ఎవరూ నమ్మరు.

అయితే ఇది పూర్తి నిజం అని అంటున్నాయి అధ్యయనాలు.  ఆ శక్తికరమైన ఈ విషయాల వివరాలోకి వెళితే రోజు వ్యాయామం చేయలేని వాళ్ళు వేడి నీళ్ల‌తో స్నానం చేస్తే చాలు అది  వ్యాయామం చేసిన‌ట్లేన‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. 

క‌ఠిన వ్యాయామాలు చేసే స‌మ‌యంలో శ‌రీరం వేడెక్కుతుంద‌ని, అలాగే వేడినీళ్ల‌తో స్నానం చేసే స‌మ‌యంలోనూ అదే జ‌రుగుతుంద‌ని తాజాగా కొందరు శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో తేలింది. అంతేకాదు 40 నిమిషాల పాటు వేడినీళ్ల‌తో చేసే స్నానం 30 నిమిషాల న‌డ‌క‌తో స‌మాన‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు.

ఒక మనిషి వేడి నీళ్ల స్నానం చేస్తే 140 కేల‌రీల శ‌క్తి ఖ‌ర్చ‌వుతుంద‌ని శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.  యూకేలోని లౌబ‌రో యూనివ‌ర్సిటీ ఫ్రొఫెస‌ర్ స్టీవ్ ఫాల్క్‌న‌ర్ న‌డి వ‌య‌సులో ఉన్న 2300 మంది పురుషుల‌పై నిర్వహించిన ఈ స‌ర్వేలో అనేక ఆ శక్తికర విషయాలు బయట పడ్డాయి. 

హాట్ బాత్ చేసే స‌మ‌యంలో వారి రక్త‌ప్ర‌స‌ర‌ణ‌ షుగ‌ర్ లెవ‌ల్స్‌ శరీరంలోని ఉష్ణోగ్ర‌త‌ రికార్డు చేసిన ఈ పరిశోధనలో హాట్ బాత్ చేసిన వారికి శారు. వారు గంట పాటు సైక్లింగ్ చేసిన వారితో సమానంగా త‌మ శ‌క్తిని 140 కేల‌రీల మేర త‌గ్గించుకున్నార‌ని ఈ అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు ఇది 30 నిమిషాల న‌డ‌క‌కు స‌మానమ‌ని ఫాల్క్‌న‌ర్ వెల్ల‌డించడంతో ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో హాట్ వాటర్ బాత్ పై బాగా క్రేజ్ పెరుగుతోంది.  అయితే మన భారత దేశంలో మాత్రం నేచురోపతి లో ఈ హాట్ వాటర్ బాత్ ట్రీట్మెంట్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని తెలిసినప్పుడు మన వైద్య శాస్త్రాలు పాశ్చాత్యుల అలోపతి వైద్యం కంటే ఎప్పుడో ముందడుగు వేసింది అన్న నిజాలు మనకు తెలుస్తాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: