ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం వలన మనకు ఎన్నో ప్రయోగానాలు  కలుగుతాయి అన్న విషయం  అందరికీ తెలిసిందే.  అయినా పైనాపిల్ జ్యూస్ లోని ప్రయోజనాలు చాలా కొద్ది మందికి మాత్రమే  తెలిసిన విషయం.  పైనాపిల్ జ్యూస్ లో విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  

ఈ జ్యూస్  తీసుకోవడం వల్ల ఒబేసిటీ రిస్క్ తగ్గించుకోవచ్చు. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లకు దూరంగా ఉండవచ్చు.  పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల  జుట్టుకి, చర్మానికి మంచి పోషణ అందుతుంది,  శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో 80క్యాలరీలు, 2 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రొటీన్ ఉంటుంది అని డైటీషియన్స్ చెపుతున్నారు.

ఈ జ్యూస్ లో ఉండే అస్కోర్బిక్ యాసిడ్ మన శరీరంలోని రకరకాల భాగాలకు మంచి చెస్తుంది. ముఖ్యంగా చర్మానికి  ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.  ఈ పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.  ఇది చర్మంలో ఎలాస్టిసిటీని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే పైనాపిల్ జ్యూస్ ని చర్మానికి ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. 

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలంగా,  హెల్దీగా మారతాయి. ఎందుకంటే ఇందులో మాంగనీస్ ఉంటుంది. ఇది ఆరోగ్యం పై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. మన పళ్లు తెల్లగా మారాలి అంటే  పైనాపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి అని డెంటిస్ట్ లు చెపుతున్నారు. 

అలాగే ఈ పైనాపిల్ చిగుళ్లను స్ట్రాంగ్ గా చేస్తుంది.  అంతేకాకుండా మన శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.  పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి క్యాటరాక్ట్స్ నుంచి మన  కళ్లను కాపాడుతుంది.  పైనాపిల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.  

అదేవిధంగా ఈ జ్యూస్ కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. కనుక పైనాపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అన్న విషయాన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: