ప్పు ధాన్యాలలో పెసలను మ‌నం  పెస‌ర ప‌ప్పు రూపంలో వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో ప‌లు కూర‌ల‌ను కూడా చేస్తూ ఉంటారు.  అయితే అటువంటి పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తింటే ఎన్నో లాభాలు ఉంటాయి.  మొల‌కెత్తిన పెస‌ల‌లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. 

ఈ మొలకెత్తిన పెసలు కొవ్వును క‌రిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు త‌ద్వారా తీసుకునే ఆహారాన్ని త‌గ్గి బ‌రువు కూడా తగ్గుతారు.

ఈ మొలకెత్తిన పెసలలో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణంగా ఇవి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను పోగొడ‌తాయి. తిన్న‌ది స‌రిగ్గా జీర్ణం అయ్యేలా చేసి ఎటువంటి అజీర్ణ సమస్యలు లేకుండా ఈ మొలకెత్తిన పెసలు సహకరిస్తాయి.

శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉన్నాయి అని వైద్యులు చెపుతారు.  విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్ యాసిడ్‌, నియాసిన్‌, విట‌మిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటివి మొల‌కెత్తిన పెస‌లలో స‌మృద్ధిగా ల‌భిస్తాయి. కాబ‌ట్టి వీటిని ప‌రిపూర్ణ పౌష్టిక ఆహారంగా ప్రకృతి వైద్యులు గుర్తిస్తారు.  

మొల‌కెత్తిన పెస‌ల‌ను తీసుకోవడం వ‌ల్ల దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త‌హీన‌త తొల‌గిపోతుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం ఉన్న వారికి మేలు జ‌రుగుతుంది. 

శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి అని అంటున్నారు . గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.  ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మొలకెత్తిన పెసలను తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: