రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం లేనట్లే అనే  సామెత ఎప్పటి నుంచో ప్రాచుర్యం లో ఉంది.  అయితే  ఇప్పటికీ మనదేశంలో  రెగ్యులర్  గా ఆపిల్ తినే  వారి సంఖ్య బాగా తక్కువ  ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం.  అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఆపిల్ కి ఉంది. ఆపిల్స్ లో చాలరకాలు  ఉన్నా సాధారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ ని మాత్రమే మనం బాగా తింటూ ఉంటాం.  

గ్రీన్ యాపిల్ దీర్ఘ కాలిక ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండుగా ప్రపంచ వ్యాప్తంగా  గుర్తిస్తున్నారు.  యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ ఆపిల్స్ లో ఉండే ఫైటో న్యూట్రీషియన్స్ మరియు యాంటా ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను, హైపర్ టెన్షన్, డయాబెటిస్ మరియు హార్ట్ సమస్యలను నివారిస్తుంది. 

గ్రీన్ ఆపిల్స్ లో డైటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.  గ్రీన్ ఆపిల్ చర్మంలోనే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. బౌల్ మూమెంట్ ప్రొపర్ గా ఉంచుతుంది. దాంతో మలబద్దకం తగ్గుతుంది.గ్రీన్ యాపిల్స్ లో ఉండే మినిరల్స్ బోన్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. 

ముఖ్యంగా ఐరన్, కాపర్, క్యాల్షియం, జింక్, మ్యాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్ ఎక్కువగా బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.  గ్రీన్ ఆపిల్స్ లో ఉండే మినిరల్స్ బోన్ స్ట్రక్చర్ ను స్ట్రాంగ్ చేస్తాయి.  థైరాయిడ్ ఫంక్షన్ ను సరిగా పనిచేసేందుకు సహాయపడుతాయి గ్రీన్ ఆపిల్స్ లో ఉండే ఫైబర్ కోలన్ క్యాన్సర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది, అంతేకాదు.  

శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగించుకుని  మెటబాలిజం రేటు పెంచుకోవాలంటే గ్రీన్ యాపిల్స్ తినడం మంచిది అని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు.  గ్రీన్ యాపిల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ను  తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను బ్యాలెన్స్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్స్ వల్ల  మతిమరుపును తగ్గిస్తుంది. 

మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే  మెంటల్ హెల్త్ ను మెరుగుపరిచే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి.  గ్రీన్ యాపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ ను హెల్తీగా ఉంచి లివర్ సమస్యలను దూరం చేస్తుంది.  వ్యాధి నిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.  ఇది శరీరంలోని అన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దాంతో శరీరానికి అలర్జీలు, ఆస్త్మా, వంటివి సోకకుండా గ్రీన్ ఆపిల్ రక్షణ కల్పిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: