మనం నివసించే ప్రపంచము లో మన చుట్టూ అల్లుకున్న అనేకానేక చర్యల ప్రభావాలను విశ్లెషిస్తే మనకు మనోహరమైన అలౌకిక సూక్ష్మ సంకేతాలు కనిపిస్తాయి. అలాగే మన చర్యలు మన శరీరం వ్యక్తీకరించే భాషను (బాడీ లాంగ్వేజ్) అందులోని సంకెతాలను విడమరచి చూసినా ఇంకెన్నో వింత విషయాలు స్పష్టమౌతాయి. ఒక వ్యక్తి వ్యవహరించే తీరు, అతని శరీర బాష చెప్పే (చేష్టలు) అతని లేదా ఆమె వ్యక్తిత్వాన్ని, మనసులో దాచుకున్న నిఘూడ విషయాలని వాటి ప్రభావాలను చెప్పకనే చెపుతాయి. అలాగే మనం స్నేతులనుగాని, ప్రియురాల్ని గాని, బందువుల్నిగాని కలుసుకున్నపుడు చేసుకునే హగ్స్ (కౌగిలింతలు) కూడా అనెకానేక రహస్య భావాలను ప్రదర్శిస్తాయి పరిశీలించే వారికి. కావలసిందల్లా అర్ధం చేసుకోగల సూక్ష్మ పరిజ్ఞానం అదీ నేర్పరితనం, లౌకిక జ్ఞానం ఉన్న వారికి. 

Image result for excellent hugs from telugu movies

ఉదాహరణకు మహాభారత లో దుర్యోధనునితో సహా కౌరవులు సమసి, కురుక్షేత్రయుద్ధం ముగియ గానే పాండవులు భగవానుడు శ్రీకృష్ణునితో కలసి దృతరాష్ట్రుని పరామర్శించటానికి వచ్చి ఆయనను తొలుత శ్రీకృష్ణుడు, ధర్మరాజు కౌగిలించుకొని ఓదార్పు మాటలు చెపుతుంటారు. ఆ తరవాత భీముని వంతు వచ్చినప్పుడు భగవానుడు భీముని ప్రక్కకు లాగి ఆస్థానములో అక్కడ ఉన్న ఎత్తైన శిలా విగ్రహాన్ని నెడతాడు. ఆ శిలా  విగ్రహాన్నే  భీముడను కొని గృడ్డివాడైన దృతరాష్ట్రుడు కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలిలోని పగ, కక్ష పూరిత వత్తిడికి ఆ శిలా విగ్రహం నుగ్గు నుగ్గవుతుంది. నిజంగా ఆ స్థానములో భీముడే ఉంటే ఆయనేమయ్యేవాడు. అదే ముందు గనే దృతరాష్ట్రుని బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకున్న శ్రీకృష్ణుడు ఆ ప్రమాదాన్ని నివారించగలిగాడు.  అప్పటినుండే "దృతరాష్ట్రకౌగిలి" అనే పదం ప్రచారములోకి వచ్చింది. దీన్నిబట్టి కౌగిలింతల్లో మర్మంకాని మంచిగాని ఉండవచ్చని అర్ధమౌతుందికదా!


మనను చుట్టేసిన కౌగిలంత లో దాగి ఉన్న అర్ధాన్ని ప్రముఖ నిపుణులు విశ్లేషించిన ప్రకారం పదకొండు రకాలున్నట్లు విశదీకరించారు. ఒకసారి పరిశీలిద్దాం. 

Image result for varieties of hugs

పట్టీవుడ్ అనే ప్రముఖ బాడీలాంగ్వేజ్ నిపుణుడు తన రచన "సక్సెస్ సిగ్నల్స్.....ఏ గైడ్ టు రీడ్ బాడీ-లాంగ్వేజ్" లో - నీ వెనుక నిలుచుని ముందున్న నీ వీపు మీదుగా నీ వక్షం క్రిందుగా తన రెండు చేతులతో చుట్టేసే కౌగిలింతే - నీకు నీడ నిస్తాను, రక్షిస్తాను అనే భావన దాగి ఉంటుందనే భావన దాగి ఉందంటారు. తనను తరచుగా, అనాలోచితంగా - నిశ్శబ్ధంగా తన వెనుక నిలుచుని "వక్షం పై నుండి తనను మృదు బాహు-బంధనం చేసే ప్రేమికుడు" తనకు సరైన నీడ నివ్వగలడని ఆప్రేయసి నమ్మొచ్చు. ఈ మోడల్ కౌగిలి నిచ్చే స్నెహితుడూ-ప్రేమికుడే " ప్రొటెక్టర్ - రక్షకుడు" గా చెప్పొచ్చు.

Image result for varieties of hugs

కౌగిలింతల భాగస్వాములిరువురూ ఒకరినొకరు తమ బాహువుతో చుట్టేసి పరస్పర వెన్నును స్పర్సిస్తే లేదా తడిమితే (రబ్ చేస్తే) ఆ రకమైన కౌగిలింత ఒకరి తో ఒకరు ఎంత ప్రస్పుట మైత్రిని కలిగిఉనారా! లేదా! అన్నది తెలుస్తుందంటారు వుడ్ "ఈ కౌగిలి కపటంలేనితనాన్ని - ఓపెన్నెస్ - హానికారకమా? కాదా? అని నిర్దారిస్తుందని" ఆ భావనను అర్ధం చేసుకోవచ్చంటారు పట్టివుడ్. ఈ విధమైన కౌగిలింతను "బాక్-స్ట్రోక్ - వెన్నును దువ్వటం" అంటారు.

Image result for varieties of hugs

ఒకరి చుట్టూ ఒకరు బహువుల తో తేలిక గా బందించి ఒకరి వీపుపై ఒకరు "పాట్ చేయటం -తట్టటం" పాట్ మోడల్ కౌగిలి. సాధారణంగా ఈ కౌగిలిలో ఏ గొప్ప భావమూ వ్యక్తంకాదు. అంటే ఒక పరామర్శ మాత్రమే. ఒక స్నెహం, ప్రేమ లాంటి బలమైన భావనలు వ్యక్తంకావు. “జస్త్ లైక్ దట్” లా...  డాక్టర్ క్రిష్టఫర్ బ్లాజెనా,  తన రచన  "సీక్రెట్ లైవ్స్ ఆఫ్ మెన్"  లో “అనేక సార్లు ఇద్దరి మద్య ఈ విధమైన కౌగిలింతలు కొనసాగుతుంటె వారి మధ్య ఏ సంభందాలు పెంపొందవని  వారు కొనసాగించలెరని - ఆ అవసరం కూడా వారికి  కనిపించని సామాజిక అనుచర లేదా కామ్రెడ్ భావం మాత్రమే  వ్యక్తపరచే  కౌగిలి ఇది”  అని విశదీకరించారు.

Image result for varieties of hugs

మృదువుగా సాగే నృత్య కౌగిలింత - సీక్రెట్ విష్పర్స్ అనే తన రచనలో ఆండ్రూస్ చెప్పినట్లు "ఏ పనిలోనూ నిండా మునిగిలేని ప్రశాంత సమయములో నీ తలపుల సందడి నాలో మత్తుగా ప్రతిద్వనిస్తుంటాయో అనిపించటం అనే భావన కలిగిఉన్న యువతీ యువకుల మద్య  కొంత సమయం ఈ రకమైన కౌగిలింతలు కొనసాగితే అది ప్రేమగా ...లౌగా ...రొమాన్స్ గా మారుతుందంటారు. ఈ రకమైన కౌగిలింత లో భాగస్వాములలో ఒకరు తన బాహువులతో  ఆమె నడుము చుట్టేస్తే..మరొకరు తన బాహువులను హారములాగా అతని మెడను చుట్టి తనవైపు గుంజుకునే స్థితి ఈ మోడల్ కౌగిలింతలో కనిపిస్తుంది, పాఠశాల విద్యార్ధులు తన్మయత్వములో చేసే నృత్యరీతి ఇందులో ప్రస్పుటమవటం గమనించవచ్చు.

Image result for varieties of hugs

ఒకరు మాత్రమే మరొకర్ని భుజంపై చేయివేసి బలంగా దగ్గరకు లాగి కౌగిలించటం ఇరు నడుములను కలుపుతూ (హిప్స్) దగ్గరగా ఉంచుకోవటం జరుగుతుంది. ఈ టైపు సాధారణంగా నేరస్తులైన భాగస్వాముల మద్య ఉంటుంది. ‘డో జాంటమట’  అనే మనోవైజ్ఞానికుని ప్రకారం "జీవితములో కోల్పోయిన సంతోషం, చిరు నవ్వు,  చిట్టి ఆశ, కొంచెం ధైర్యం - తిరిగి ఈ స్నెహము ద్వారా పొందుతారంటారు". ఈ కౌగిలి బందములో హిప్స్ కలసిపోయి,  రొమాన్స్ మించని మరో బందం కనిపిస్తుంది. దీన్నే “రీచ్ అరౌండ్ హగ్ - ఒకరిని చుట్టేసే కౌగిలింత-“ అంటారు. ఒకరి భాగస్వామ్యమే ప్రధానం కావటముతో దీనిని అర్థకౌగిలింత కూడా (హాఫ్-హగ్) అంటారు.  

Image result for tight hug from Telugu movies

డెడ్లాక్ హగ్" చూసేవాళ్ళకు విడిపోతే బాగుండుననేంత రాక్షస కౌగిలింత ఇది. శరీరాలను నుజ్జుచేసేంత దగ్గరగా, గాలి చొరనివ్వని ఈ కౌగిలింతలో ఇరు తనువుల అల్లుకున్నట్లు పెనవేసు కుంటాయి. ఈ హగ్ లో హృదయాంతరాళాల్లోనుంచి పొంగుకొచ్చిన ప్రేమ కోరిక అంకితభావం విడిపోవద్దు  విడిపోతే మళ్ళీ కలవలేమేమో అన్నంత తపన ఇమిడి ఉంటుంది. దీన్ని భారతీయ కామశాస్త్రాల్లో బిగి-కౌగిలి అంటారు. రచయిత కేరల్ బ్యూయంట్ వివరించిన ప్రకారం "మనవలు మనవరాండ్ర కోసం అమ్మమ్మ చలికాలముకొసం సూదితో అల్లిన సుతిమెత్తని మృదువైన బొంతలా వెచ్చదనాన్ని పంచుతుందంటారు." నునువెచ్చని ఆ కౌగిలిలో లభించే ప్రేమ దుప్పట్లో దూరినట్లు ఆ  భాగస్వాములకే తెలుస్తుంది బయటివాళ్ళు ఊహించలేరు.

Image result for flying hug from Telugu movies

ఫ్లయింగ్ హగ్ - గాబ్రియల్ గార్షియా మార్క్స్ అభిప్రాయం ప్రకారం ప్రేమ లభించనప్పుడు సెక్స్ తోనైనా సరిపెట్టుకోవాలన్న కాంక్ష ఇందులో ఇమిడి ఉండి భాగస్వామి కనపడగానే ఎగిరి వారి దేహంపై ఫిక్స్ అయ్యే స్థితి ఇది. ప్రేమ సంభందం ఉండాలి -  ఒక వేళ లేకున్నా కాంక్షతో రగిలే దేహాలు కామాన్ని తీర్చుకొనే క్రమం ఈ హగ్ ప్రాధాన్యత గా కలిగి ఉంటుంది. దీన్ని విహంగ ప్రేమ అనవచ్చు. కుదిరితే ప్రేమించు లేకపోతే వాడి వదిలెయ్ అనే భాగస్వామ్యుల మోడల్.

Image result for varieties of hugs

లండన్ బ్రిడ్జ్ హగ్ - లూయీస్ మెహ్గుల్ ప్రకారం ఈ కౌగిలింత ఒక సాంఘిక అవసరం (ఫార్మాలిటి) సూచిస్తుంది. శరీరాల పైభాగం మాత్రమే పొడిపొడిగా కలుస్తూ - క్రింది భాగం చాలా దూరములో ఉంచుతూ చేసే కౌగిలింత ఇది. ఈ కౌగిలింతలో భాగస్వాముల మద్య అనంగీకారం మాత్రమే కాదు అసౌకర్యము ఉంటుంది.    

Image result for eye to eye hug from Telugu movies

ఐ టు ఐ - హుగ్ - కన్నులు కలసిన ఆత్మల కౌగిలి ఇది. సనొబెర్ ఖాన్ ప్ర్కారం "నీవే న ప్రేమ మహా సామ్మ్రాజ్యానివి, మహా సముద్రానివి" అని భాగస్వాములిరువురూ అనుకునే ప్రేమైక కౌగిలిది. ఇరు ఆత్మల కలయిక. నిజమైన ప్రేమ ప్రదర్శన. ఎవరూ విడదీయలేనంత ఆత్మల ప్రఘాడ బాందవ్యము ఉంటేనే ఈ కౌగిలి సాధ్యం. ఈ హగ్ లో ఇరు కన్నుల లోతైన కలయిక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మిగతా బాహుబందాల కలయికకు అంత విలువ ఉండదు. 

Image result for Rock Doll hug from Telugu movies

రాగ్ డాల్ హగ్ - ఇది వన్ వే ప్రేమను సూచిస్తుంది. ప్రేమ అంటే ఇరు మనసుల కలయిక. ఒక భాగస్వామి ఘట్టిగా కౌగిలో లీనమైనా మరొకరు బొమ్మలా కొయ్యబారి ఉండటం ఈ కౌగిలి లక్షణం. ఇక్కడ ఒకరి బలమైన ప్రేమకు మరొకరి నుండి స్పందన కరువవుతుంది. ఇచ్చి పుచ్చు కోవటాలు లేని ఈ ప్రేమ కు చెందిన కౌగిలిలో తూకం సరిగా ఉండదు. భాగస్వాములలో ఒకరు ఘాడమైన ప్రేమతో స్పందిస్తే మరొకరు స్పందనకు మొరాయిస్తారు.  

Image result for kinds of Hugs - pick pocket hug

పిక్ పాకెట్ హగ్ - రితూ ఘటోరీ ప్రకారం- ఇద్దరి మద్య నిశ్శబ్ధం సౌకర్యమైతే - మీకు ప్రేమ తెలిసి పోతుంది. అప్పుడు కౌగిలింతలకు దారి ఏర్పడుతుంది. ఈ కౌగిలింతలో ఒకరికొకరు ఎదురై ఒకరి రెండు చేతులు వెరొకరి వెనుక జేబుల్లో ఉంచి చేసే కౌగిలింత ఇది. ఇక్కడ గొప్ప సౌకర్యం చనువు ఉంటేనే ఇది సాధ్యం. ఈ మోడల్ ప్రేమ అతి సౌకర్యవంతం స్నెహం తో కూడినదే. ఈ బాందవ్యాన్ని బలపరచుకోవటం అంత కష్టం కాదు. ఇది నిజంగా నిజమైన కలయిక.    

మరింత సమాచారం తెలుసుకోండి: