ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్ వల్ల వాటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని వైద్యులు సలహా ఇస్తున్న నేపధ్యంలో రాత్రి భోజనం తరువాత మనం తీసుకుని ఫ్రూట్స్ వలన మన ఆరోగ్యానికి అనుకోని సమస్యలు ఏర్పడతాయి అని వస్తున్న పరిశోధన ఫలితాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

పండ్లు తనడం మంచిదే అయినా ఆ పండ్లను ఎప్పుడుపడితే అప్పుడు తినకూడదు అని వైద్యులు చెపుతున్నారు.  ముఖ్యంగా ఈ ప్రూట్స్ ను రాత్రి భోజనం తరువాత తినే అలవాటు చాలామందికి ఉంటుంది.  అయితే ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు అని అంటున్నారు.

ఫ్రూట్స్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో అదేవిధంగా లంచ్ తో కలిపి తీసుకోవడం మంచిదే అయినా ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి ముందు ఒక గంట ముందుగా ఈ ఫ్రూట్స్ ను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.  అయితే ఈ ఫ్రూట్స్ ను విడిగా తినకుండా జ్యూస్ గా మార్చుకుని తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుందని డైటీషియన్స్ చెపుతున్నారు. 

మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది అది తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రిపూట పడుకునే ముందు  ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవ్వడానికి ఇబ్బంది ఏర్పడి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు.

అందువలనే నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వారాంతాలలో అల్పాహారానికి బదులుగా ఎక్కువగా పండ్లు తింటే మరింత ఆరోగ్యoగా ఉంటారని డైటీషి యన్స్ చెపుతున్నారు.  ముఖ్యంగా యాపిల్ బొప్పాయి వంటి పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ను ఎంత వీలైతే అన్ని తీసుకువడం ఆరోగ్యానికి అన్ని విధాల ఎంతో శ్రేయస్కరం అని డాక్టర్ల సలహా ఇస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: