రాగుల నుండి తయారు చేసిన పిండిని మన ఆహారoలో దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  ముఖ్యంగా రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారంగా తీసుకుంటారు. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి అని పరిశోధనలు చెపుతున్నాయి.  రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్, అయోడిన్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది. రాగులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ద్రవయాసిడ్ ను పెంచుతుంది.  

రెగ్యులర్ డైట్ లో రాగులను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. రాగిలో ఫాలిఫినాల్స్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా  ఉంటుంది.  బియ్యం, బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ కంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ రాగుల్లో ఐరన్ అత్యధికంగా ఉన్న నేపధ్యంలో  ఇది మన  రక్తంలో హీమోగ్లోబిన్ కు అసవరమయ్యే ఐరన్ ను అందిస్తుంది.   

ఈ పిండి లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా  ఉన్న నేపధ్యంలో మన  వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం అదే విధంగా శరీర కణజాలముల బాగు కోసంకుడా రాగి పిండి తో చేసిన వస్తువులు  వాడతారు మన శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో  రాగులు సహాయ పడతాయి. 

రాగుల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల మాల్ న్యూట్రిషియన్ లోపంను నివారిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను  నివారిస్తుంది అని వైద్యులు చెపుతారు. దీనికి తోడు గుండె ఆరోగ్యానికి  కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసంవంటి సమస్యలకు  రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. 

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి  ఉండటంతో  కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల  జీర్ణక్రియను  మెరుగు పడుతుంది.  

అదే విధంగా రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతికలిగి మనం  అధికంగా తీసుకునే   ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది.  ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ రాగిపిండితో  ప్రతీరోజు మనం  ఎన్ని ఆహారపు పదార్ధాలు చేసుకుకోగిలిగితే అంత మంచిది..  


మరింత సమాచారం తెలుసుకోండి: