కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఇదే కొబ్బరి నుండి వచ్చే కొబ్బరి పాలు వల్ల మనకు లభించే అనేక ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.  కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్ధాన్ని కొబ్బరి పాలు అని అంటారు. 

ఈ పాలు తెల్లని  రంగులో మంచి కమ్మని రుచి కలిగి ఉంటుంది.  ఈ కొబ్బరి పాలలో  రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి.  అందువల్లనే  ప్రపంచవ్యాప్తంగా ఈ పాలను రకరకాల పదార్ధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. 

అంతేకాదు కోకనట్ వాటర్ కు కోకనట్ మిల్క్ కూడా మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.  అదేవిధంగా కొబ్బరి పాలు పచ్చిగా కూడ  త్రాగవచ్చు.  తాజా అధ్యయనాలలో కొబ్బరి పాలను  ఆవు పాలతో సమానంగా పరిగణిస్తున్నారు.  కొబ్బరి పాలలో అధిక శాతం లారిక్ ఆమ్లం, కొవ్వు ఉంటాయి. ఈ కొవ్వు వల్ల రక్తంలో అధిక సాంధ్రత కలిగిన లిపోప్రొటిన్ కొవ్వు శాతం పెరుగుతుంది. 

ఈ కొబ్బరి పాలను నోటి పూతలను తగ్గించేందుకు సైతం ఉపయోగిస్తారు. ఈ పాలలోని సంతృప్త క్రొవ్వుపదార్థం చాలావరకూ లారిక్ ఆమ్లం.  ఇది హృదయ సంబంధ వ్యవస్థపై అనుకూల ప్రభావాలు చూపుతుంది.  కొబ్బరి పాపలలో విటమిన్స్, మినిరల్స్, మరియు క్యాలరీలు అత్యధికంగా ఉన్నాయి. అందుకే మనం ఈ కోకనట్ మిల్క్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆయుర్వేద వైద్యం చెపుతోంది.

ఈ  కొబ్బరి పాలను బ్యూటి మరియు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో కూడ ఉపయోగిస్తారు.  కొబ్బరి పాలలో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో ఈ కొబ్బరి పాలు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంతేకాదు ఈ పాల వల్ల బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి, ల్యూరిక్ యాసిడ్ వ్యాధినిరోధకతను పెంచడానికి  బాగా సహాయపడుతుంది. కొబ్బరి పాలలో క్యాల్షియం మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి . ఇవి బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి, ఇది మాత్రమే కాదు ఇది బోన్ ఫ్రాక్చర్ ను రిస్క్ ను తగ్గిస్తుంది. కాబట్టి, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కొబ్బరి పాలను తాగాలి అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.

కొబ్బరి పాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మతిమరుపును నివారిస్తుంది. ఇక ముందు మతిమరుపు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మతిమరుపు సమస్యతో బాధపడే వారు కొబ్బరి పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ఎఫెక్టివ్ మార్పులు వస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పాలు మన శరీర రుగ్మతలు దూరం చేసే దివ్య ఔషధం..


మరింత సమాచారం తెలుసుకోండి: