చాలామందికి భోజనం చేసిన తరువాత ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అయితే డానికి బదులు భోజనం తరువాత ఒక టీ స్పూన్ సోంపు తింటే వచ్చే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్య పడతారు.  ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో చాల మంది ఈ సొంపును తినే అలవాటు మానుకున్న నేపధ్యంలో అసలు సోంపు వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా దీనిని తినక మానరు.

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో నేడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు.  దీనితో ఈ ఇబ్బందులు ఉన్న వారు 1 టీస్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే దాని వ‌ల్ల జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.  అంతేకాదు వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్యను ఇట్టే పరిష్కరించుకోవచ్చు. 

ఆదేవిధంగా భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారడమే కాకుండా నోటిలో ఉండే  బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించి పోవడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి.  మహిళలకు సంబంధించి రుతుస్రావం అయ్యే స‌మ‌యంలో వచ్చే సమస్యలకు కూడ ఈ సోంపు పరిష్కారం చూపెడుతుంది.

సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఈ సోంపు అడ్డుకట్ట వేస్తుందని అనేక పరిశోధనలు కూడ తెలియచేసాయి.  ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌లో ఉండటంతో  ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. 

మ‌ధుమేహం ఉన్న వారు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.  సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. 

అంతేకాకుండా పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్థాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఈ సోంపు సహకరిస్తుంది అని ఆయుర్వేద వైద్యులు కూడ సూచిస్తున్నారు.  ఇలా ఎన్నో ప్రయోజనాలు గల ఈ సోంపు వాడకం ఇక నుంచి అయినా అలవాటు చేసుకుందాం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: