Related image


భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడు,  ఐతే ఒక రోజు ఆ భర్తృహరి విక్రమార్కుని పిలిచి  "తమ్ముడూ ! ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వర పుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వ లక్షణ సంపన్నుడవై బుద్ధి మంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్య భారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగ భాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గము న పాలన గావించు" అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. 


Related image


అప్పటి నుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదా క్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందు తూ ధనకనక వస్తు వాహనాలతో తుల తూగుతూ పుణ్యరాశి గా పేరు పొందాడు.


ఇలా ఉండగా కొంత కాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు "మరణ మనేది లేకుండా ఉండే వరమీయమని" అడి గాడు. అందుకు శివుడు "ఓ ! రాజా ! మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి  ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరమేదైనా కోరుకో" అన్నాడు.


అందుకు విక్రమార్కుడు "సరిగ్గా ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు మాత్రమే వయసు గల అమ్మాయికి పుట్టిన కొడుకు వలన నాకు మరణం సంభవించేలా వరమీయ మని" కోరాడు. శివుడు దానికి "సరే తధాస్తు" అని వరమి చ్చి "నువ్వు ఇంకా వెయ్యేళ్ళు రాజ్య సుఖం అనుభవించగలవు" అని దీవించి మాయమయ్యాడు.


తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి తన మంత్రి ఐన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు. అది విన్న భట్టి చాలా తెలివి గలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే "రాజా నీకు భగవంతుడు వెయ్యేళ్ళు బ్రతకమని వరమిచ్చాడు కదా, పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా, కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే నీవు రాజ్య పాలన చేసి మిగిలిన ఆరు నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపౌతుంది. అందువలన రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతావు. ఒక్క ఆరు నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి. నీ జీవిత కాలం పెరుగుతుంది" అని సలహా ఇచ్చాడు.


Image result for samraT vikramarka tapas bhatti  images

అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలు పరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒక నాడు ఒక యోగి వచ్చి తనతో స్మశానానికిరమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోమాలు మంత్ర తంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుని బలి ఇవ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకుని ఆ యోగి ని బేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుని మెచ్చి  "ఓ రాజా !నీకు అవసర మైనప్పుడు ఆపద సమయములోను నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడువచ్చి నిన్ను కాపాడగలను. నీకు అస్టసిద్ధులూ లభ్యమగు గాక" అని దీవించి మాయమయ్యాడు. బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిం దన్న మాట.


అదే సమయాన బ్రహ్మాది దేవతలు "నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదని" దీవించారు. పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు, సత్రములు, సంతత యాగములతో అనేక పుణ్యకార్యము లతొతో నిత్యమూ దానధర్మాలతో తేలి యాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయనీ పురాన్ని పరిపాలించి విక్రమార్క ‘శకకర్త’ గా పేరు పొందాడు.


“పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా?”  ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? 


Related image

భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది. ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రా నదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహా పట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్య వంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్ర గుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. 


కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. 


అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు ఇంద్రపదవిని ఆశించి ఘోర  కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా మేనక నే లను ఆజ్ఞాపించాడు. ఐతే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించ టం జరిగింది.



ఇంతకీ ఆరోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు "ఇంతటి మహా మణులున్న సభలో నిర్ణయించే గొప్పవారేలేరా?" అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి "ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించ గలడు కావున అతగాడిని పిలిపించవలసిందని" కోరాడు. 


అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయనీ నగరాన్ని చేరుకుని "రాజా నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది" అని విన్నవించాడు.


అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి "కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుని సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్క నే ఉన్న మణిమయరత్నఖచితమైన సింహాసనమ్మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. "ఓ నరనాథా! ఈ రంభా మేనక లు ఒకరిని మించి మరొకరు గొప్పనాట్య గత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవటమం మాతరంకాలేదు. నీవు సకలవిద్యా పారంగతుడవు కావున వీరిద్దరి లో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు" అని విన్నవించాడు. 


Image result for Indraloka menaka images

అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వ గానంతో శరీరము మెరుపు తీగవలె శృంగారము వర్షించునట్లు గా నాట్యం చేసింది. మరునాడు మేనక తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యము చేసింది. ఇద్దరినీ పరిశీలించిన మీదట "మేనక " నే నేర్పరిగా నిర్ణయించాడు "అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?" అని ప్రశ్నించాడు ఇంద్రుడు. 


అందుకు "ఓ దివిజేశా! కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే మేనక నాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది. అందువల్ల మేనక నే నిర్ణయించటం జరింది" అని చెప్పాడు.

అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతో పాటు నవరత్నఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది. 


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: