మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడ అంత అత్యవసరం. అయితే మారిపోతున్న అలవాట్లు పెరిగి పోతున్న టెన్సన్స్ మధ్య మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు అన్నది వాస్తవం.  అయితే మనం ఖచ్చితంగా ప్రతిరోజు మ‌నం క‌చ్చితంగా 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి అని వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. 

వృద్ధులు, పిల్ల‌లు అయితే 10 గంట‌ల‌కు పైగానే నిద్ర పోవాలని వైద్యుల సలహా.  నిద్ర వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవ‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తొలగిపోతాయి అని పరిశోధనలు చెపుతున్నాయి. మ‌నం నిద్ర‌పోయే క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు తానే ప‌లు మ‌ర‌మ్మ‌త్తులు కూడా చేసుకుంటుంది అని అంటారు. దీనికోసమైనా మనం ఖచ్చితంగా 6 గంటలు నిద్రపోవాలి. 

6 గంట‌ల కన్న త‌క్కువ నిద్ర‌పోతే ఆ త‌రువాతి 48 గంట‌ల పాటు శ‌రీరానికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ ల‌భించ‌దు అని అనేక పరిశోధనలు తెలియచేసాయి. దీనితో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మస్య‌లు దగ్గరకు రావు. ఆరు గంట‌ల క‌న్నా త‌క్కువ నిద్రిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండ‌రు. దీనితో నిత్యం త‌గినన్ని గంట‌ల పాటు నిద్ర‌పోక‌పోతే అది మెద‌డుపై ప్ర‌భావం చూపుతుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గ‌డ‌మే కాదు, ఏ విష‌యాన్ని స‌రిగ్గా ఆలోచించ‌లేరు. ఆలోచ‌నా శ‌క్తి త‌గ్గుతుంది. 

అంతేకాదు స‌రిప‌డా నిద్ర‌పోక‌పోతే డిప్రెష‌న్ బారిన ప‌డ‌తారు. దీనికితోడు చాలామంది మూడీగా కూడ ఉంటారు. ఇది అనేక ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.  స‌రిగ్గా నిద్ర‌లేకపోవడం వల్ల బ‌రువు పెర‌గ‌డం లాంటి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి.  

దీనికితోడు వృద్ధాప్యం త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంది. నిద్ర పోక‌పోతే అలాంటి వారి ముఖంపై ముడ‌త‌లు ప‌డ‌తాయి. అది వృద్ధాప్య ఛాయ‌ల‌ను తెలిపే మొదటి సంకేతం.  దీనివల్ల మన శరీరానికి ఎంతో మేలు చేసే సరైన పద్ధతిలో నిద్ర పోవడం అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని అర్ధం అవుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: