“నిద్ర లేమితో జపాన్ భారీగా నష్టపోతోంది. దేశ ఆర్థిక రంగం 138 బిలియన్ డాలర్లు (రూ.9.2 లక్షల కోట్లు) కోల్పోతోంది. ఇది జీడీపీలో 2.9 శాతం. ఈ వివరాలను ఓ అధ్యయనం వెల్లడించింది. కనీస విశ్రాంతి ఉండాలని నిర్దేశించే చట్టాలు ఏవీ జపాన్‌లో లేనందున గంటల తరబడీ ఉద్యోగులు శ్రమించక తప్పడం లేదు. ఆరు గంటల్లోపే ఉన్న నిద్రా సమయాన్ని ఏడు గంటలకు పెంచగలిగితే 75.7 బిలియన్ డాలర్ల మేర దేశంలో ఆర్థిక వృద్ధి కనిపిస్తుందని ఆ అధ్యయనం సూచించింది”


distrubed sleep hd images కోసం చిత్ర ఫలితం


కాలం మారుతోంది- మానవ జీవితంలో పని వత్తిడి, జీవన విధానములో తీవ్రమైన మార్పులు, వృత్తి జీవితంలో పోటీ, వ్యక్తిగత జీవితములో వెగం, ఆతృత, కుటుంబ జీవితములో ఆటుపోట్లే కాదు సమయాన్ని కేటాయించ లేని పరిస్థితులు, సంఘ జీవనం దుర్భరం, వాతావరణం కాలుష్యమయం ఇవన్నీ కలసి వ్యక్తిని మనసికంగా, భౌతికంగా కృంగదీయటం, నేటి గ్లోబల్ జీవితము లో వేళాపాళ పాటించని పనులవత్తిడి తో ప్రతిమనిషి నిద్ర విషయములో పాటించవలసిన క్రమశిక్షణ పాటించ లేకపోవటం పరిపాటి అయింది. 'నిద్ర' గురించి సీరియస్ గా ఆలోచించవలసిన సమయం వచ్చింది.


సంబంధిత చిత్రం


నిద్ర మ‌న శ‌రీరానికి అత్యంత అవ‌స‌రం. ప్ర‌తి రోజూ మ‌నం క‌చ్చితంగా 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. వృద్ధులు, పిల్ల‌లు అయితే 10 గంట‌ల‌కు పైగానే నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవ‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల అనారోగ్యస‌మ‌స్య‌లు పోతాయి. మ‌నం నిద్ర‌పోయే క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు తానే ప‌లు మ‌ర‌మ్మ‌త్తులు కూడా చేసుకుంటుంది. అందుకే మ‌నం క‌చ్చితంగా రోజూ నిర్దిష్ట స‌మ‌యం ప్ర‌కారం, నిర్దిష్ట‌మైన గంట‌ల ‌పాటు నిద్రించాలి.


distrubed sleep hd images కోసం చిత్ర ఫలితం


అయితే రోజుకు 6 గంట‌ల క‌న్నా త‌క్కువ‌గా నిద్ర‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు చూద్దాం..! 



*నిత్యం 6 గంట‌ల కన్న త‌క్కువ నిద్ర‌పోతే ఆ త‌రువాతి 48 గంట‌ల పాటు శ‌రీరానికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ ల‌భించ‌దు.  దీంతో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మస్య‌లు ద‌రి చేర‌తాయి.

*ఆరు గంట‌ల క‌న్నా త‌క్కువ నిద్రిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండ‌రు. నిరాస‌క్తంగా, స్తబ్దుగా, మ‌బ్బుగా ఉంటారు. ఏ ప‌నీ యాక్టివ్‌గా చేయ‌రు. ఇది మూడ్‌ను మారుస్తుంది.

*నిత్యం త‌గినన్ని గంట‌ల పాటు నిద్ర‌పోక‌పోతే అది మెద‌డుపై ప్ర‌భావం చూపుతుంది. మెద‌డు చురుకుదనం వేగం సృజ నాత్మకత తగ్గిపోతాయి.  దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి మందగిస్తుంది. ఏ విష‌యాన్ని స‌రిగ్గా ఆలోచించ‌లేరు. ఆలోచ‌నా పటుత్వం,  శ‌క్తి త‌గ్గుతుంది. చ‌దువుల్లో ఉన్న‌వారైతే వాటిలో రాణించ‌లేరు. ఏ విష‌యాన్ని స‌రిగ్గా గుర్తు పెట్టుకోలేరు.


sleeplessness hd images కోసం చిత్ర ఫలితం

* స‌రిప‌డా నిద్ర‌పోక‌పోతే డిప్రెష‌న్ బారిన ప‌డ‌తారు. సంతోషం స్థాయిలు త‌గ్గుతాయి. అలాంటి వారు ఎల్ల‌ప్పుడూ మూడీగా ఉంటారు. అది ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.

*ఆఫీసులో ప‌నిచేసే ఉద్యోగులైనా, చ‌దువుకునే విద్యార్థులైనా త‌మ ప‌నిపై స‌రిగ్గా ఫోక‌స్ పెట్ట‌లేరు. దీంతో అనుకున్న ప‌ని పూర్తి చేయ‌లేక‌పోతారు. దాని వ‌ల్ల పై నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు.

*నిత్యం త‌గిన‌న్ని గంట‌లు నిద్ర‌పోక పోతే స్త్రీ, పురుషుల్లో శృంగార వాంఛ త‌గ్గుతుంది. పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ లెవ‌ల్స్ త‌గ్గి శృంగారం అంటే అంత‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌రు. ఒక వేళ చేసినా స‌రైన సామ‌ర్థ్యం ఉండ‌దు.


sleeplessness hd images కోసం చిత్ర ఫలితం



*స‌రిగ్గా నిద్ర‌పోక పోతే ఎదుర‌య్యే ఇంకో స‌మ‌స్య బ‌రువు పెర‌గ‌డం. నిద్ర త‌గినంతగా పోక‌పోతే బ‌రువు పెరుగుతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. క‌నుక ఫ్యాట్‌గా మార‌కుండా ఉండాలంటే క‌నీసం త‌గినన్ని గంట‌ల నిద్ర అవ‌స‌రం.

* వృద్ధాప్యం త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంది. నిద్ర పోక‌పోతే అలాంటి వారి ముఖంపై ముడ‌త‌లు ప‌డ‌తాయి. అది వృద్ధాప్య ఛాయ‌ల‌ను తెలియ‌జేసేందుకు మొద‌టి సంకేతం. అలా అలా క్ర‌మంగా వారికి త్వ‌ర‌గా వృద్ధాప్యం వ‌స్తుంది.


distrubed sleep hd images కోసం చిత్ర ఫలితం


సుఖమైన నిద్రకోసం, నిద్రసమస్యల్ని విశ్లేషించే పరిశోధనల అవసరం పెరిగిపోతుంది. అందుకే నిద్ర విలువ తెలిసి దాని పై ప్రయోగాలు పరిశోధనలు మొదలయ్యాయి.


సంపూర్ణ ఆరోగ్యానికి తగినంత నిద్ర అవసరం - దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.   

“నిద్ర లేమి భయంకర ఆరోగ్య సమస్య”  అతి నిద్ర మాత్రమే కాదు అతి  విశ్రాంతి అనర్డమే !,

రాత్రి విధులు హానికరం ,  

కునుకు మంచిదే, ,  

నిద్ర తగ్గితే,  'ఆ సుఖం' హుష్ కా కే!

 

ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన నిద్ర పొందటం చాలా కష్టం అయిపొయింది. కారణం- చేసే పనిలో ఒత్తిడి, వయసు పెరగటం, ఇంట్లో ఉండే టెన్షన్లు, పిల్లలు మరియు వారి జాగ్రత్తల గురించి ఆలోచించటం వలన నిద్రపోవటం చాలా కష్టంగా మారింది.  నిద్రకోసం  అల్లోపతి మందులను (నిద్ర మాత్రలు) వాడటం అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి. కారణం- దీర్ఘకాలం పాటూ వీటిని వాడటం వలన మన శరీరం వీటికి బానిసలుగా మారుతుంది. కావున ఇలాంటి వాటిని కాకుండా, సహజ ఔషదాలను మరియు బానిసలుగా మార్చని మార్చని ఔషదాలను వాడటం ఆరోగ్యం మాత్రమె కాకుండా, నిద్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.


ashwagandha కోసం చిత్ర ఫలితం

నిద్ర-లేమి నుండి రక్షించటానికి ఆయుర్వెదము లో అనేక ఔషదాలున్నాయి. అందులో “ఆశ్వగంధ” ముఖ్యమైనది.  అశ్వగంధను ఇంగ్లీష్ లో  'వింటర్ చెర్రీ'  లేదా 'ఇండియన్ గిన్సేంగ్'  అంటారు. ఈ ఔషదం నిద్ర పోవటాన్ని ప్రోత్సహిస్తుంది. లాటిన్ భాషలో దీనిని దీని శాస్త్రీయనామం  'విథానియా సోమ్నిఫెరా' అంటారు.  సోమ్నిఫెరా అంటే  ''నిద్రను కలిగించే''  అని అర్థం.


అశ్వగంధ, మెదడుపై అనుకూల ప్రభావాలను చూపి, టెన్షన్, చిరాకులను తగ్గించి కండరాలను శాంత పరుస్తుందని చాలా పరిశోధనలలో వెల్లడైంది. టెన్షన్, చిరాకు ఒత్తిడి, “నిద్రలేమి జబ్బు” (ఇన్సొమ్నియా)కు ముఖ్య కారణం, ఇన్సొమ్నియా రాత్రి సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టి నిద్రను చెదరగొడుతుంది.


ashwagandha కోసం చిత్ర ఫలితం


ప్రతి రోజు పడుకోటానికి ముందుగా ఒక గ్లాసు వేడి పాలు తాగటం  మరియు విశ్రాంతిని అందించే వ్యాయామా లను, యోగా మరియు ధ్యానం వంటి పద్దతులను అనుసరించటం వలన ఒత్తిడి తగ్గి మంచి గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంది. సుఖ నిద్రపోయే అవకాశం ఉంది.

 

నిద్రభంగానికి కూడా ముఖ్యకారణం వత్తిడే.   ఈ ఔషదం అడ్రినల్ గ్రంధి నుండి కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కార్టిసాల్ డిప్రెషన్,  రక్త పీడనాన్ని మరియు ఇన్సొమ్నియా వ్యాధిని అధికం చేస్తుంది. అశ్వగంధ కార్టిసాల్ విడుదలను తగ్గించి, నిద్ర పోయేలా ప్రోత్సహిస్తుంది. శరీరానికి విశ్రాంతిని చేకూర్చి, శరీరంలోని అన్ని అవయవాలు  సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. అవయవాలు పనిచేయటములోని  లోపాలను  వెంటనే  సరి చేసి,  విధిని సరిగా చేసేలా చేస్తుంది.


ashwagandha కోసం చిత్ర ఫలితం 

అశ్వగంధ శరీరాన్ని విశ్రాంతి పరచుటలో శక్తి వంతంగా పనిచేస్తుంది  కావున, 3 నుండి 4 వారల పాటూ తీసుకోవటం వలన మార్పును గమనించవచ్చు. దీనిని కొన్ని నెలల తీసుకు న్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా, నెలల పాటూ తీసుకొని, మానేసి మరల తిరిగి తీసుకోవటం వలన ఎలాంటి సమస్యలు ఉండవని పరిశోధనలలో వెల్లడి అయింది.



అశ్వగంధ నియమిత పరిమాణములో తీసుకోవలన దుష్ప్రభావాలు కలగటం ఉండదు. 'పీటర్ లిచ్ఫీల్డ్' వాదన ప్రకారం, ఈ అల్లోపతీ మందుల కన్నా ఇది శక్తి వంతంగా పని చేస్తుందని తెలిపారు.  అధిక మొత్తంలో తీసుకున్న ఎడల, ఆరోగ్య సమస్యలు కలుగుతాయని తెలిపాడు. కావున నిద్ర మాత్రల కన్నా, అశ్వగంధను తగిన మొత్తంలో తీసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు.


సంబంధిత చిత్రం


ప్రశాంతమైన నిద్రను అందించే అశ్వగంధ ఔషదాలను, ముఖ్యంగా ఒత్తిడి. ఉద్రేకతలకు లోనయినపుడు మాత్రమె వాడటం మంచిది. దీని అవసరం మన ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది  వాడే ముందు ఆయుర్వేద వైద్య నిపుణులను కలవటం శ్రేయస్కరం  

మరింత సమాచారం తెలుసుకోండి: