సామాన్యంగా నట్స్ అనగానే బాదం, జీడిపప్పు గుర్తుకు వస్తాయి. అయితే వాల్ నట్స్, ఆప్రికాట్స్, డేట్స్, ఇవన్నీ కూడా డ్రైనట్స్ క్రిందికే వస్తాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, అద్భుతమైన న్యూట్రీషియన్స్ గుణాలు ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి.  వాల్ నట్స్ అంటే కేవలం డ్రై ఫ్రూట్స్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. 

కానీ వీటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరు ఈ వాల్ నట్స్ ను విడిచి పెట్టారు. ఇవి కేవలం మెదడుకి, మెమరీ మెరుగుపరచడానికి ఉపయోగ పడటానికే కాకుండా ఇంకా చాల ప్రయోజనాలు ఈ వాల్ నడ్స్ లో ఉన్నాయి. కేవలం రోజుకు మూడు వాల్ నట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చుఅని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 
 
వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి.  వీటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియంలు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు నాన బెట్టిన తరువాత తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.  వీటిని నానబెట్టి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. 

దీనితో గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. వాల్ నట్స్ ని నానబెట్టి ప్రతిరోజూ తినడం వల్ల డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ కి వాల్ నట్స్ చక్కటి పరిష్కారం. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి. 

శరీరంలో క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను పూర్తీగా ఈ వాల్ నట్స్ నాశనం చేస్తాయి. వీటిని తరుచు తీసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ కి దూరంగా ఉండవచ్చు. ఇవి మన శరీర బరువు తగ్గడానికి కూడ ఎంతగానో సహాయ పడతాయి. దీనితో వాల్ నట్స్ ను ఉదయం, రాత్రి నిద్రకు ముందు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని వైద్యులు కూడ సూచిస్తున్నారు. ఇన్ని ఫలితాలు ఉన్న ఈ వాల్ నట్స్ ను ప్రతిరోజు తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది..  


మరింత సమాచారం తెలుసుకోండి: