భారత దేశంలో అరటికి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ చెట్టు నుంచి ఆకులు, పండ్లు, కాండం ఇలా ప్రతి ఒక్కటీ ప్రయోజన కరంగా ఉంటాయి.  ఇక ఏవైనా శుభకార్యాలు జరిపితే ఆరటి చెట్టును వాటి ఆకులను ఉపయోగిస్తుంటారు.  ఇక భోజనాలకు కూడా ఎక్కువ శాతం అరటి ఆకులోనే వడ్డిస్తుంటారు.  ఇది పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.  దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని దక్షిణ భారతదేశంలో పాటిస్తూనే ఉన్నారు. వివాహాల్లోనూ, వేడుకల్లోనూ వీటిని విరివిగా వినియోగిస్తారు. నేలపై పరిశుభ్రమైన అరటి ఆకులో అహార పదార్థాలను వడ్డించుకుని చేతితో తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. 

Image result for అరటి ఆకులో తింటే కలిగే ప్రయోజనాలు

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 

Image result for అరటి చెట్టు

ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. 

Image result for అరటి చెట్టు

అరటి ఆకులు పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి అన్ని ఆహార పదార్థాలను ఒకేసారి వడ్డించవచ్చు.అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: