పిల్లలకు తల్లిదండ్రులను మించిన రోల్ మోడల్ ఉండరు.. ప్రతి చిన్నారికీ తల్లిదండ్రులే ప్రపంచం. ఇద్దరి నుంచి ఒకేసారి నిండైన ప్రేమని కోరుకుంటుందా చిన్నారి. ఇద్దరి మధ్య గొడవలప్పుడు ఒకరి నుంచి ప్రేమ కరవవుతుంది. లేదా దూరం పెరుగుతుంది. అది పెరిగి కౌమారంలోకి వచ్చేటప్పటకి బయటివాళ్లు ఏ కాస్త అభిమానంగా మాట్లాడినా కరిగిపోతారు. తప్పటడుగులు వేస్తారు. 

mother father fight hd కోసం చిత్ర ఫలితం

ఈ విషయం ఎంత సున్నితమైన దంటే.. పెళ్లైనా ఆ తపన పోదు. ఎదుటివాళ్లు తాము ఆశించినంతంగా కోరుకున్నట్టు ప్రేమించడం లేదనే బాధ మొదలవుతుంది. ఇది వారి సంసారంలోనూ చేదు నింపుతుంది. మన భారతీయుల్లో ఉన్న సమస్య ఇది! పిల్లల ముందు దంపతులిద్దరూ కనీసం చేతిలో చేయివేయడానికీ ఇబ్బంది పడతారు. ప్రేమ చూపించుకోవడానికీ మొహమాటపడతారు.

సంబంధిత చిత్రం

ఒకర్నొకరు ఎప్పుడోకానీ తాకరు. ఇంతగా ఇబ్బందిపడేవాళ్లు.. పిల్లల ముందు గొడవపడటాన్ని మాత్రం నామోషిగా భావించరు. విదేశాల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలైతే ‘పిల్లల ముందు దంపతులిద్దరూ కౌగిలించుకోవడం మంచిది. అది పిల్లల్లో భద్రతా భావాన్ని నింపుతుంది!’ అని అంటున్నాయి. మనం మరీ అంతచేయనక్కర్లేదు. ఆత్మీయంగా భుజం తట్టడం, దగ్గరగా కూర్చుని టీవీ చూడటం వంటివి చాలు.

mother father fight hd కోసం చిత్ర ఫలితం

మరి ఈ సమస్య ఎలా సరిదిద్దాలి.. అందుకు మార్గాలు ఉన్నాయి. పిల్లల ముందు ఏమాత్రం నియంత్రణ కోల్పోవద్దు. ఇద్దరికీ కోపం తెప్పించగల అంశాలు ఏవైనా పిల్లల ముందు ఏ రకంగా ప్రస్తావించకూడదు. లక్షల డబ్బు పెట్టి చదివించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం కన్నా ఈరకంగా మనం అందించే ప్రశాంతతే ఎంతో విలువైంది. ఒకవేళ గొడవపడినా తప్పకుండా మీ పాపకో బాబుకో దానిపై వివరణ ఇవ్వండి.



మరింత సమాచారం తెలుసుకోండి: