నేటి సమాజంలో ప్రతి సామాన్యుడు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.  ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మద్య తరగతి వ్యక్తి పడుతున్న కష్టాలు, బాధలు చాలవన్నట్లు మనం సంపాదించిన సొమ్ములో ప్రభుత్వానికి కట్టే పన్నులే ఎక్కువ అయ్యాయి.  మన ముందు తరం వారు ఏదైనా సంపాదించిన ఆస్తులు ఉంటే..అవి సమర్థవంతంగా కాపాడుకుంటుసొసైటీలో కాస్త హుందాగా బతుకుతున్నారు కొంత మంది.  కానీ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఉద్యోగం చేసే వారు పడే కష్టాలు ఏంటో..ఒక్కసారి చూడండి..!


!! మధ్యతరగతి మా రాజులం .. GOVT.కి  గొర్రెలం 🐏🐏🐏
ఎందుకంటే..........
▪రూపాయి బియ్యం తినలేం.
50 రూపాయలకి బియ్యం కొనలేం
▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం.. మినరల్ వాటర్ కొనలేం
▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..
కలల ఇల్లు కట్టుకోలేం
▪ ప్రభుత్వ బడికి పంపలేం..
కార్పొరేట్ ఫీజులు కట్టలేం
▪ సర్కారు దవాఖానా కు పోలేం.. 
కార్పొరేట్ బిల్లులు కట్టలేం
▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..
బండికి పెట్రోలు కొనలేం
ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!
 Image result for common man problems
👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..
👋🏻అవినీతి పోవాలనేది మనమే.. 👋🏻అవకాశం. వస్తే  అవినీతిని సమర్ధించేది మనమే..
👋🏻ఇంటికో భగత్ సింగ్ పుట్టాలని చెప్పేది మనమే..👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..
👋🏻మార్పు రావాలని చెప్పేది మనమే..👋🏻అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..
 
అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే వెర్రి గొర్రెలుగా మిగిలిపోతున్నాం


మరింత సమాచారం తెలుసుకోండి: