సుమారుగా మరణానికి 4-5 గంటల ముందు, భూతలంతో తెగతెంపుకు చిహ్నంగా ఫుట్ సోల్ క్రింద వున్న భూమి ఆత్మ చక్రాలు విడివడతాయి    కనుక, ఒక వ్యక్తి చనిపోబోయే ముందు వారి కాళ్ళు చల్లగా వుండటం, మీరు గమనించవచ్చు.తరువాత వెళాల్సిన అసలు సమయం ఆసన్నమైనప్పుడు, యముడు అంటే మరణం యొక్క దేవుడు ఆ వ్యక్తిని తీసుకు వెళ్ళడానికి వస్తాడు అని చెప్పబడివుంది.


నిజానికి అది "సూక్ష్మ తీగను" అంటే " సిల్వర్ కార్డు"ను  అంటే ఏదైతే శరీరానికి మరియు ఆత్మకు  అనుసంధానం అయి వుందో ఆపోగును తెంచివేస్తుంది. ఒకసారి ఆ పోగు తెంచివేయబడ్డ తరువాత ఆత్మ స్వేచ్ఛను పొందుతుంది, శరీరం బయటకు ప్రయాణిస్తుంది.


 
 శరీరాన్ని ఆత్మ ఎప్పుడూ ఇష్టపడుతుంది కనుక, అది తిరిగి శరీరంలోకి వెళ్ళి అందులో సర్దుకోవడానికి  అక్కడ వుండటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మీరు గమనించగలిగితే మరణించిన తరువాత   సూక్ష్మమైన కదలికలు గమనించవచ్చు , వ్యక్తి యొక్క ముఖం చిన్నగా కదలడం గమనించవచ్చు, నిజానికి ఇది ఆత్మ లోపలికి ప్రవేశించటానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే అది చనిపోయిందని నమ్మటం లేదు కనుక. అక్కడ ఇంకా జీవం యొక్క భావన వుంటుంది. కానీ  వెండితీగ తెగిపోయింది.


ఈ స్థితిలో ఆత్మకు ఒక్కసారిగా ఎన్నో గొంతులు వినిపిస్తాయి. అవి ఆ గదిలోని వ్యక్తుల యొక్క ఆలోచనలు తప్ప ఇంకేమీ కావు. ఆత్మ అందరితో ఇంతకు మునుపులా  మాట్లాడుతుంది,  నేను చనిపోలేదు అని అరిచి చెబుతుంది, కానీ దాన్ని ఎవరూ వినిపిచుకోలేరు. నిదానంగా మరియు స్థిరంగా ఆ ఆత్మ తాను చనిపోయానని గుర్తిస్తుంది మరియు తిరిగి వెళ్ళడానికి అక్కడ దారి లేదు, అప్పుడు అది ఇంటి పై భాగాన్ని చేరి  జరుతున్నదంతా చూస్తుంది, వింటుంది.  సాధారణంగా అది ఆ శరీరం చుట్టూ దహన కార్యక్రమం జరిగే వరకు వుంటుంది. శరీరాన్ని దహనానికి తీసుకు వెళ్ళడం చూస్తుంది. ఆ ఊరేగింపులో అన్నీ వింటూ, ప్రతి ఒక్కరినీ సాక్షిగా చూస్తూ ఉంటుంది.


ఒకసారి దహనం జరిగాక, భూమి మీద  తన పాత్ర పూర్తయిపోయిందనే నమ్మకం కలుగుతుది. ఎన్నో సంవత్సరాలుగా తనను పట్టి వుంచిన శరీరం పంచ భూతాలలో కలిసి పోయిందని తెలుసుకుంటుంది.


అప్పుడు ఆత్మ పూర్తి స్వేచ్చను అనుభవిస్తుంది. శరీరం వున్నపుడు వున్న హద్దులు ఇప్పుడు లేవు. ఇప్పుడు  తనకు కావలసిన చోటుకు చేరుకోవాలి. ఏడు రోజుల వరకు ఆత్మ తనకు ఇష్టమైన స్థలాలలో తిరుగుతుంది. చనిపోయినవారు డబ్బు ఉన్నవారైతే ఆత్మ తన బీరువా దగ్గర వుంటుంది లేక తన పిల్లల మీద ప్రేమ వుంటే ఆత్మ వారి గదిలో  వారిని తగులుకుంటూ వుంటుంది.
       

ఏడవ రోజు  కాని లేక పదకొండోరోజు కానీ తన కుటుంబానికి వీడ్కోలు పలికి పైలోకాలు నుంచి వచ్చిన మాస్టర్స్ సహాయంతో పైలోకాలకు వేడుతుంది. వెళ్ళటానికి ఇష్టం లేకపోతే, ప్రేతాత్మలా అక్కడే తిరుగుతుంది. ఈవిషయాలు కొంతవరకు మాత్రమే.....

మరింత సమాచారం తెలుసుకోండి: