ఎయిర్ కండిషనర్ నేడు అన్ని ఇళ్లల్లోనూ సాధారణ వినియోగ వస్తువుగా మారుతోంది.  అందుకే ఏసీ బిల్లు తగ్గించుకుని కూల్ గా ఉండే టిప్స్ ఏంటో చూద్దాం. 
ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏసీ ఫిల్టర్లను వారానికోసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉన్నట్టయితే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దాంతో గది తొందరగా చల్లబడుతుంది. దీంతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది.

Image result for air conditioner

గదిలో ఎంత మేర ఉష్ణోగ్రత ఏసీ టెంపరేచర్ 25-27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా సూచనీయం. దీనివల్ల గది చల్లబడడం, బిల్లు తగ్గడం రెండూ సాధ్యమవుతుంది. 18 డిగ్రీలను సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గే వరకూ కంప్రెషర్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. వేసవిలో బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైన ఉన్నప్పుడు గదిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలంటే ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికం అవుతుంది. 24 డిగ్రీలకు పైన టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగాన్ని తగ్గించొచ్చు. 


Related image

గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఆన్ చేయడం చాలా మంది చేస్తుంటారు. అలా చేయకూడదు. తరచూ ఆన్, ఆఫ్ వద్దు
ఏసీని తరచూ ఆన్, ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత 25-27 డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు. గది తలుపులు తరచూ తెరిచి, మూసేయవద్దు. ఇలా తెరిచిన ప్రతీసారీ బయటి నుంచి వేడి గాలి లోపలికి చొరబడుతుంది. దాంతో గదిలో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది.
 

Image result for air conditioner room

తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనే ముందే పవర్ ఇన్ పుట్ చూడండి. సాధారణంగా ఒక టన్ను ఏసీకి 5 స్టార్ రేటింగ్ ఉన్నవి 930 యూనిట్ల నుంచి 980 యూనిట్ల వరకు వినియోగించుకుంటాయి. ఏసీ ఇండోర్ యూనిట్ కు వీలైనంత తక్కువ దూరంలో అవుట్ డోర్ యూనిట్ (కంప్రెషర్)ను ఏర్పాటు చేసుకోవాలి. ఏసీని ఆన్ చేసిన తర్వాత వేగంగా చల్లబడాలని ముందు 16 డిగ్రీల్లో ఉంచేసి తర్వాత తగ్గించడం సరైన ఆలోచన కాదు. విద్యుత్ ఆదాను కోరుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచీ ఒకటే ఉష్ణోగ్రతలో ఉంచాలి. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: