ఈ రోజుల్లో డ‌బ్బుంటే చాలు, ఏదైనా చేయోచ్చు, ఎంతటి వాడినైనా లొంగ‌దీసుకోవచ్చు,  ఎంతటి ప్రాంతమైన వెళ్లోచ్చు, జీవితంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఎంజాయ్ చేయాలని చూసే యువ‌త‌నే చూశాం. అంతేకాదు వారికి స‌హ‌క‌రించే త‌ల్లిదండ్రులు అడ‌పాద‌డ‌పా ఉండ‌క‌పోతారా...? అయితే హిరాత్ వారి కుటుంబం నేప‌థ్యం దీనికి పూర్తిగా భిన్న‌మ‌ని చెప్ప‌డం కాదు. చేసి చూపించాడు హ‌రాత్‌. 


వేల కోట్ల వ్యాపారాల‌కు అధిప‌తైన హిరాత్  అతి సామాన్యుడిగా హైద‌రాబాద్‌లో గ‌డిపారు. త‌న నాన్న ఇచ్చిన విమాన టికెట్టు తో హైద‌రాబాద్ కు వచ్చారు. శంషాబాద్‌లో దిగి సికింద్ర‌బాద్‌కు చేరేట‌ప్ప‌టికీ జేబులో రూ. 500 మాత్ర‌మే ఉన్నాయి. ఆర్కే లాడ్జీలో రూ. వంద‌కు బెడ్ ఇస్తే బ‌సచేశాడు. ఓ రైతు బిడ్డను ఇంట‌ర్ చ‌దివాన‌ని ప‌ని చేస్తాన‌ని చెప్పి లాడ్జీలో ప‌నిచేశాడు. మెక్‌డోనాల్డ్ , నైక్ ఔట్‌లెట్, జాక్స‌న్ జాన్‌, ఆడిడాస్ కంపెనీ పని చేశాడు. 

కొన్ని రోజులు ఫర్నిచర్ షాప్‌లో సేల్స్‌బాయ్‌గా పనిచేశా. నాలుగువారాల్లో నాలుగు ఉద్యోగాలు చేసి ఖర్చులు పోగా రూ.4,700 సంపాదించాడు.రోజు సాంబారుతో బోజ‌నం చేసిన 49 ఎం బ‌స్సులో ప్రయాణిస్తూ సిటీ చూసే వాడు. ఫైవ్ స్టార్ హోటళ్ల‌లో విలాసాల వంత‌మైన జీవితాన్ని అనుభ‌వించిన అత‌ను ఎందుకు సాధార‌ణ వ్య‌క్తి గా మార‌డో అత‌డి మాటల్లోనే జీవితంలో విలువ‌ను అర్ధం చేసుకోవ‌డం కోసం ఇంటి పెద్దలు చూపిన మార్గంలో ప‌య‌నించాను. 

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని లేదు. ఇండియాలోనే బిజినెస్ చూసుకుంటా. దేశ పరిస్థితుల్ని చెడుగా ఊహించు కుంటూ, విదేశీ అవకాశాల్ని గొప్పగా భావించే ఆలోచన పోవాలనేది నా అభిప్రాయం అని హిరాత్ వివరించాడు. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి, హైదరాబాద్‌లో సేల్స్‌బాయ్‌గా గడిపాను. సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారం చేసే హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమాని ఘన్‌శ్యాం ధోలకియా కుమారుడు హిరాత్ నెలరోజుల తన అను భవాలను పంచుకున్నారు.  

నా పేరు హిరాత్. వయసు 23. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివా. సూరత్ లో నాన్న, తన ముగ్గురు సోదరులు వజ్రాల వ్యాపారం చేస్తారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం ప్రతిఒక్కరూ జీవితం విలువ తెలుసు కునేందుకు కొన్నిరోజులపాటు నిరుపేదగా మారాలి. మావాళ్లు 15 ఏండ్లు గా ఈ కట్టుబాటును ఆచరిస్తున్నారు. ఏటా ఒకరు చేతిలో డబ్బులేకుండా నెలపాటు సామా న్యుడిలా కష్టపడి పనిచేసే బతుకాలి. వారానికో ఉద్యోగం మారాలి.  కష్టం వస్తే భరించాలే తప్ప వెనుతి రుగొద్దు. కుటుంబ నేపథ్యం, చదువు, డిగ్రీలు కూడా చెప్పొద్దు. ఈ ఏడాది నా వంతు వచ్చింది. హైద‌రాబాద్ కు వ‌చ్చాను.  అడిగిన వాళ్లలో ఎవరూ కాదనలేదు. హైదరాబాద్ ప్రజలు చాలా పాజిటివ్‌గా ఉంటారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: