Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 21, 2017 | Last Updated 9:20 pm IST

Menu &Sections

Search

జనన మరణ చ్రకంలో జీవితరహస్యం

జనన మరణ చ్రకంలో జీవితరహస్యం
జనన మరణ చ్రకంలో జీవితరహస్యం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందు తున్నాడు. 'శుభకరమైనదీ, సుఖకరమైనదీ' అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు. విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.


ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.


శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|
శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో
యోగక్షేమాత్‌ వృణీతే||''

kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi

విశ్వజిత్‌ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నా తండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు? అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.

kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi

కాలగతిలో ఎలాగూ నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.

kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi

నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడు రోజులుగా నిరాహారుడై ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యముడు అతనికి మూడు వరాలను ప్రాయశ్చిత్తంగా అను గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని ఆశలూ, ఆం క్షలూ, సత్ఫలి తాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి. అందుకే నచికేతుని సంతృప్తి పరచడానికి మూడు వరాలను అనుగ్రహిస్తాడు యముడు.


యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రిస్తుంది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడి గిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమ ధర్మ రాజు. మరణాంతర గతులను నిర్ణ యించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే అయినా అసా ధ్యమనిపించే నచి కేతుని కథా రూపం సంగతి కాసేపు పక్కన పెడితే...

kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi

జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.
జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు.
kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi
మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు. కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూ ఢమైనదీ ఆత్మ.


ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకల ప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్య తత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.


''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|
బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''

kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi

శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు
పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.


మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు. జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు. ఇంద్రియాల కంటే శ్రేష్ఠమైనది మనస్సు. మనస్సుకంటే శ్రేష్ఠ తరం బుద్ధి. బుద్ధికంటే శ్రేష్ఠం ఆత్మ. మహత్తు కంటే అవ్యక్తం పరం. అవ్యక్తం కంటే మనిషి శ్రేష్ఠతరం. పురుషుని కంటే పరమాత్మ శ్రేష్ఠతరం, సర్వావ సానం. కనుక ఆత్మచైతన్యమే ఆలంబనగా జీవితాన్ని స్వీకరించి, అనుభవించి పరమ పదంలో లీనం చేయగల మార్గమే మానవ జీవిత పార మార్థిక నిధి తత్త్వం. రహస్యం.


kathopanishad-telugu-yamudu-sachikedtudu-ap-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లాభాల బాటలో స్టాక్‌మార్కెట్..!
వివో స్మార్ట్‌ఫోన్ 'వీ7' విడుదల..!
స్పెషల్ : చేపల పచ్చడి
పోసాని కి బన్నీవాసు మద్దతు..!
నానీ  ‘ఎంసీఏ’ టైటిల్ సాంగ్ అదుర్స్..!
టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ వీడింది..!
స్టైలిష్ స్టార్ ముద్దుల పాపకు సర్‌ప్రైజ్ విశెస్..!
నాకు నంది అవార్డు వద్దు..లోకేష్ పై పోసాని ఫైర్..!
జానా ని కలిసిన రేవంత్ రెడ్డి..అందుకేనా..!
మీడియా సాక్షిగా..ఐశ్వర్య రాయ్ కన్నీరు పెట్టుకుంది..!
విశాఖలో వింతపక్షుల గోల..!
మరీ ఇంత దారుణమా..!
వైసీపీ నేతలపై కేసు నమోదు..!
ఈ సారి  "కొడకా కోటేశ్వర రావా.." అంటున్న పవన్..!
పరమ విలక్షణ శ్రీవైష్ణవుల ధర్మము
అన్నయ్యను చూస్తూ పవన్ నవ్వుతున్నాడు..కానీ నిజం తెలిస్తే షాక్..!
రుచికరమైన ఓట్స్ ఉప్మా
పవన్ ని తెగ పొగిడేశాడు..!
అవును..నా మైండ్ దొబ్బింది..కానీ..!
‘నేను నిన్ను చంపటం గ్యారంటీ’..అంటూ..!
జిమోకి వైఫై డబ్బా షాక్..!
భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం..!
శ్రీవారికి సమర్పించే నైవేద్యం వివరాలను తెలుసుకుందాం
వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు
ఏపీలో మగవారిని చంపుతారా..?: ఎమ్మెల్యే రోజా
వెరైటీ కాలీ ఫ్లవర్ రైస్
వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని అదుర్స్
సీఎం చంద్రబాబు గురించి బిల్ గెట్స్ ఏమన్నారో తెలుసా..!
మార్కెట్ లోకి సరికొత్త ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్
మూడీష్‌ జోరు..స్టాక్ మార్కెట్ పరుగు..!
కృష్ణా నదిలో మరో బోటు మునక..కానీ..!
చిరు కెరీర్ లో అది ఫస్ట్ టైమ్ అట..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి నేడే అవార్డు ప్రదానం!
మీడియా వేధికగా జబర్థస్త్ ఆది-కత్తి మహేష్ లు తిట్టుకున్నారు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.