కొందరి దృష్టి మంచిది కాదని విశ్వసింపబడింది. ఇతరుల ప్రగతిని మరియు శుభాన్ని చూసి ఓర్వలేని గుణం కలవారి దృష్టి చెడు ప్రభావం కలిగి వుంటుందని విశ్వాసం. దూరప్రయాణాలు చేసికానీ లేదా ఏదైనా కార్యానికి వెళ్లి వచ్చిన అనంతరం కానీ, కొన్నిసార్లు కొందరు అలసినట్లుగా ఢీలాపడిపోతారు. ఇది ఎవరిదో చెడుదృష్టి పడిందని, అందుకే ఢీలాపడ్డానని బామ్మలు అంటుంటారు.


ఈ దిష్ఠిని తొలగించడం కోసం వారు ఆవాలను గుప్పిట్లోకి తీసుకొని తల నుండి పాదాల వరకు శరీరానికి ఇరువైపుల గుండా చుట్టూతా మూడుసార్లు తిప్పి మంటలో పొయ్యిలో వేస్తారు. ఈ విధంగా తిప్పుతున్పపుడు, తిప్పేవారు మరియు తిప్పించుకునేవారు నిశబ్దంగా ఉండాలని చెప్పబడింది. అలా పొయ్యిలో ఆవాలు పటపటా మండుతూ కాలి పేలుతుంటే దిష్ఠి నాశనమయిందని తలచే వారు.వాస్తవానికి ఇలాంటి దిష్ఠి తీయడంలో మానసిక చికిత్స అంశం దాగివుంది.


దిష్ఠి తీయడంలో మానసిక చికిత్స అంశం దాగివుంది. దిష్ఠి తీయబడిన వ్యక్తి తన నుండి ఏదో చెడు తొలగిపోయిందనే నమ్మకం అతన్ని హుశారుగా మార్చి తన దినచర్యను ఉత్సాహంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. ఆవాలు కాలి వస్తున్న పొగ యెక్క వాసన కూడా ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: