నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తున్న  డయాబిటీస్ క్యాన్సర్ ల నివారణకోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధులను సమూలంగా నివారించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో డయాబిటీస్ క్యాన్సర్ మన దరిదాపులలో లేకుండా చేసే పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్తులలో మిర్చి ఘాటుతో  డయాబిటీస్ కు తరుణోపాయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. మన వంటకాలలో మిరపకాయలను కారంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వినియోగిస్తూ ఉంటాం. 

అయితే ఆ కారంలోని ఘాటు క్యాన్సర్ డయాబిటీస్ ల నివారణకు ఒక వరంగా మారుతుందని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి. మిరపలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. అంతేకాదు ఈ మిరప కొలస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం క్యాన్సర్ రోగులకు మిరప ఒక వరప్రదాయని అని అంటున్నారు. ఇక మిరప రక్తంలోని చెక్కర పాళ్ళను గణనీయంగా నియంత్రించడంలో సహకరిస్తుందని లేటెస్ట్ పరిశోధనలు చెపుతున్నాయి.

దీనితో డయాబిటీస్ ఉన్నవారు తగిన మోతాదులో మిరపను తింటే మిరప మేలుచేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా మిరపకాయలో పొటాషియం మ్యాంగనీస్ ఐరన్ మెగ్నీషియం వంటి చాలరకాల ఖనిజాలు ఉంటాయి కాబట్టి అవి మన రక్తపోటును నియంత్రిచడంలో కూడ చాల సహకరిస్తాయి అన్న పరిశోధనలు కూడ ఉన్నాయి. దీనికితోడు మిరపకాయలను తమ ఆహార పదార్ధాలలో బాగా తినేవారిలో వారి శరీర నిగారింపు ఎక్కువగా ఉండటమే కాకుండా ఈ మిరపకాయలు తినడం వల్ల కళ్ళు కూడ ఆరోగ్యంగా ఉంటాయి. 

ముఖ్యంగా చర్మం పై ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిరపకాయలు తింటే అవి వేగంగా తగ్గుతాయి అన్న పరిశోధనలు కూడ ఉన్నాయి.  ఇది ఇలా ఉండగా ఈమధ్య జరుగుతున్న చాల పరిశోధనలలో మిర్చి అలవాటు వల్ల డయాబిటీస్ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు చాల మేలుజరుగుతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రాబోతున్న రోజులలో మిర్చి ఘాటు విలువైన ఔషధంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: