సమాజంలో పోటీ వాతావరణం విపరీతంగా పెరిగి పోవడంతో ప్రతి వ్యక్తి తెలివితేటలను కోరుకుంటున్నాడు. దీనితో తమ తెలివితేటలు పెంచుకోవడానికి ధ్యానం దగ్గర నుండి మన ఆహారపు అలవాట్ల వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మష్రూమ్ తో అనేక రుచికరమైన వంటలు తయారుచేయడం సర్వసాధారణంగా మారిపోయింది. 

అయితే ఈ మాష్రూమ్ లలో ఒకరకమైన పుట్టగొడుగు మనోధర్మి గుణాలను కలిగి ఉండి మనోధర్మి సంబంధిత పరిశోధనలు జరపటానికి కేంద్ర బిందువుగా మారడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ గుణాలను కలిగి ఉండే పుట్టగొడుగులు డిప్రెషన్ తగ్గించటానికి సహాయపడతాయి కాబట్టి వీటిని . మ్యాజిక్ మష్రూమ్ లుగా వైద్య శాస్త్రంలో గుర్తిస్తున్నారు.  'సిలోసైబిన్' మరియు 'సిలోసిన్' మనోధర్మి సమ్మేళనాలను కలిగి ఉండే పుట్టగొడుగు జాతులను మ్యాజిక్ మష్రూమ్ గా గుర్తిస్తున్నారు. 

ఈ రకమైన నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉండే పుట్టగొడుగులు దాదపు 200 వరకు ఉన్నాయి. ఈ రకం పుట్టగొడుగులు హలోసినోజెనిక్ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఎక్కువగా అమెరికాలో ఉపయోగిస్తున్నారు. మెదడులోని నాడీ ప్రసారాన్ని ప్రభావిత పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉండి సైకోథెరపీ ప్రయోజనాలను కలిగించటం వలన ఈ మ్యాజిక్ మష్రూమ్ లు శాస్త్రజ్ఞులకు ఆసక్తికర అంశంగా మారింది. 

మ్యాజిక్ మష్రూమ్ లు ఫోటోట్రోఫీక్ మందులుగా చేసి వాడటం వల్ల కేంద్రనాడీ వ్యవస్థ ప్రభావితమై   డిప్రెషన్ ను తగ్గిపోతుంది. ఈ మ్యాజిక్ పుట్టగొడుగులు చాలా రకాల జాతులుగా అందుబాటులో ఉన్నాయి. వాటి వాడకం మరియు మోతాదులు ఒక దానితో ఒకటి పోలి ఉండవు. సాధారణంగా ఒక గ్రాము మ్యాజిక్ మష్రూమ్ లను తీసుకొని వాటి ప్రభావాలను గమనించమని వైద్యులు సలహాలు  ఇస్తుంటారు. సాధారణంగా కొంతమంది పుట్టగొడుగులను నములుతారు కానీ కొంతమంది వీటి రుచిని ఇష్టపడరు. ఒకవేళ రుచి మీ సమస్య అయినట్లయితే ఇతర పండ్లుతో కలుపుకుని తీసుకోవచ్చు. పుట్టగొడుగులు కేంద్రీయ నాడీ వ్యవస్థపై పనిచేసి  డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి. మ్యాజిక్ మష్రూమ్ లను తీసుకునే ముందు వైద్యుడిని కలిసి తగిన సలహా తీసుకోవటం మంచిది అని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కూడ వీటి వాడకం గురించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: