చాలామందికి నడివయస్సు వచ్చిన తరువాత తమ కళ్ళకింద నల్లటిమచ్చలు చారలు ఏర్పడటంతో చాలబాధ పడుతూ ఉంటారు. వీటిని పోగొట్టుకోవడానికి బ్యూటీ క్లినిక్స్ చుట్టూ తిరుగుతూ కూడ ఉంటారు. అయితే ఇలాంటి వారికి తమ కళ్ళకింద ఏర్పడ్డ సమస్యలను పోగొట్టుకోవడానికి చింత పండు వైద్యం బాగాపనిచేస్తుంది అని అధ్యయనాలు చెపుతున్నాయి. సిట్రిక్ యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. 

కేవలం కంటి కింద ఏర్పడే నల్లటి చారాలను తొలగించడానికే కాకుండా  త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు ఈ చింతపండు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అంతేకాదు మన శరీరంలోని వాపులు నొప్పులకు చింతపండు రసాన్ని రాసి మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. దెబ్బల వల్ల వచ్చిన వాపులు బెణుకులకు చిక్కటి చింతపండు గుజ్జు ఉడికించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు వాటిపై పూస్తే వెంటనే తగ్గుతాయి అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. జీర్ణశక్తిని పెంచే గుణం ఈ చింతపండులో ఉంది. 

చర్మ సౌందర్య సాధనాలలో కూడ చింతపండును వాడుతారు. ముఖ్యంగా ముఖం పై మచ్చలు గాయాలను మాన్పడానికి చింతపండు సహాయ పడుతుంది. చింతపండు రసం ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో కడిగితే ముఖంలో గ్లో పెరుగుతుందని అంటారు. చింతపండు పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జుచేసి ఈమిశ్రమాన్ని ముఖానికి పూసి ఆరనివ్వాలి తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

చింత గింజలతో మోకాళ్ళ నొప్పులని కీళ్ళ నొప్పులని చాలా సులభంగా తగ్గించవచ్చు. ఇలా రోజు చేయడం వలన 30 రోజులలో మోకాళ్ళు చాలా బలంగా తయారు అవుతాయి. అదేవిధంగా కరిగిపోయిన మోకాళ్ళ గుజ్జు తిరిగి చేరుతుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. చింత గింజలలో ఎముకలకి బలాన్ని చేకూర్చే వివిధ రకాల ఔషదాలు కూడా ఉంటాయి. ఇలా ఏన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న చింతపండును ఇప్పటివరకు మనం వంటకాలలో ఉపయోగించే పదార్ధంగానే మనకు తెలుసు. ఇన్ని గుణాలు ఈచింతపండులో ఉండటంతో ఇప్పుడు వైద్యశాస్త్రంలో కూడ ఈచింతపండు ప్రాముఖ్యత పెరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: