మొక్కజొన్న పొత్తు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ప్రతి దేశంలోనూ విరివిగా లభించే ఆహారం. ఇది అతి చౌకగా లభించే ఆహారం మాత్రమే కాకుండా వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మొక్కజొన్న గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. 

మొక్కజొన్న గింజలనుండి ‘పేలాలు’ 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. బేబీకార్న్ పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె కూడా తీస్తారు ఇన్ని ప్రయోజనాలుగల మొక్కజొన్నను మనం ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నాము. మొక్కజోన్నలో అనేక విటమిన్లు ఉండటంతో దీనిలోని లవణాలు, విటమిన్లు ఇన్ సులిన్ మీద ప్రభావం చూపుతాయి కాబట్టి మధుమేహగ్రస్తులకు ఈమొక్కజోన్న  చాలా మంచిది. 

అంతేకాదు మన శరీరంలోని కొలెస్టిరాల్ ను మొక్కజొన్న నియంత్రిస్తుంది. ఈ మొక్కజొన్న వల్ల కాన్సర్ ,గుండె సంబంద సమస్యలు దరి చేరకుండా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే తీపి పదార్థం జ్ఞాపకశక్తిని పెంచుతుంది అని అధ్యయనాలు చెపుతున్నాయి. ఒత్తిడి అనిపించినప్పుడు ఒక కప్పు ఉడికించిన గింజలు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు స్వీట్ కార్న్ లో ఉన్నాయి అని వీటివల్ల గుండె జబ్బులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరో మంచి మార్గం అంటూ అనేక పరిశోధనలు తెలియచేసాయి. స్వీట్ కార్ప్ లో ఉండే ఖనిజమైన క్రోమియమ్ పాళ్ళు ఎంతగా పెరిగితే గుండెజబ్బులు వచ్చే అవకాశఆలు అంతగా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల ఇక అధ్యయనంలో తెలుసుకున్నారు. అందువల్ల స్వీట్ కార్న్ బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి..   



మరింత సమాచారం తెలుసుకోండి: