ప్రస్తుతం పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతివ్యక్తి అనేక విషయాలను తన చదువు కెరియర్ గురించి గుర్తించుకోవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. అయితే ఈపోటీ చాలామందిలో టెన్షన్ కు దారితీస్తు ఉండటంతో చాలామంది చిన్న విషయాలను కూడ వెంటనే మరిచిపోయే పరిస్థుతులకి వెళ్ళిపోతున్నారు. దీనితో జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి అనేక వ్యక్తిత్వ వికాస క్లాసులకు అదేవిధంగా మెమరీని పెంచే సాధనాల వైపు అనేకమంది తమ దృష్టిని సారిస్తున్నారు. 

అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఎలాంటి వ్యక్తి అయినా తమ జ్ఞాపకశక్తిని బాగా అభివృద్ధి చేసుకోగాలుగుతారని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిన్నచిన్న విషయాల పై శ్రద్ధ పెడితే ప్రతి వ్యక్తికి తమ జ్ఞాపకశక్తి బాగా పెరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ప్రతి వ్యక్తి నిత్యం ఖచ్చితంగా 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. త‌గినంత నిద్ర‌లేక‌పోయినా మెదడు ప‌నితీరు మంద‌గిస్తుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంది. 

క‌నుక స‌రిగ్గా నిద్ర‌పోతే జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు అని అంటున్నారు. దీనికితోడు రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరం దృఢంగా మార‌డ‌మే కాదు, మాన‌సిక ఉల్లాసం కూడా క‌లుగుతుంది. ఫ‌లితంగా ఏకాగ్ర‌త పెరుగుతుంది. మెద‌డు ప‌నితీరు మెరుగ‌వుతుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. ఏప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ మ‌ధ్యమ‌ధ్య‌లో కొంత విరామం తీసుకోవాలి. 

అదేప‌నిగా ఒకే ప‌ని నిరంత‌రాయంగా చేయడం వల్ల అలసట రావడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడ బాగా తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. దీనితోడు సుడోకు, ప‌ద‌కేళి వంటి మెద‌డుకు మేత పెట్టే ప‌జిల్స్‌ను త‌ర‌చూ పూర్తి చేసే వారికి మెద‌డు షార్ప్ గా మారి జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అదేవిధంగా నిత్యం స‌మ‌యం త‌ప్ప‌కుండా వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవాలి. అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని రోజూ తినాలి. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు అయినా ధ్యానం చేయాలి. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లిగి ఏకాగ్ర‌త పెరగడమే కాకుండా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈచిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మనకు రోజురోజుకూ పెరిగిపోతున్న మతిమరుపు సమస్య నుండి బయటపడవచ్చు..   


మరింత సమాచారం తెలుసుకోండి: