ప్రస్తుతం ప్రపంచ మానవాళిని కుదిపేస్తున్న డయాబెటీస్ వ్యాదికి పరిష్కారాలు వెతికే దిశగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనేక ఆయుర్వేద చిట్కాలు డయాబెటీస్ వ్యాధి నివారణకు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో పసుపు టీ డయాబెటీస్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో చాల ఉపయోగపడుతుందని లేటెస్ట్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

మనదేశంలోని ప్రతి ఇంటి వంట గదిలో పసుపు ఉంటుంది. పసుపులోని ఔషధ గుణాలు దీని ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తం అవ్వడంతో ఏకంగా కొన్ని దేశాలు పసుపును తన పేటెంట్ గా మార్చుకోవాలని అమెరికా లాంటి సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ప‌సుపు అద్భుత ఔష‌ధం. ప‌సుపు స‌హ‌జ సిద్ద‌మైన యాంటీబ‌యాటిక్. ప‌సుపును సంస్కృతంలో హ‌రిద్రా అంటారు. 

ఈ పసుకు ఉన్న ఔషద గుణాలు వల్ల క్యాన్సర్ ను నిరోధించే గుణం కూడా ఉన్న‌ట్లు పలు పరిశోధనల్లో తేలింది. దీనితో పసుపు కలుపుకుని టీ త్రాగడం ఎంతో మంచిది అని చెపుతున్నారు. పసుపులో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆమ్లజనకాలు ఎక్కువగా ఉండటంతో క్యాన్సర్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పసుపు టీవల్ల మెదడు పని చేసే సామర్థ్యం బాగా పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. 

ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారణకు వెయిట్ లాస్ కు పసుపు టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు టీ కొలెస్ట్రాల్స్ ను తగ్గించి వ్యాధుల బారిన పడకుండా ఉండేలా చేస్తుంది.  ముఖ్యంగా ఇందులో ఉండే ఆమ్లజనకాలు మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు కూడా పసుపు టీ బాగా సహాయపడుతుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవడం చాలా మంచిది అని అంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు తెలుసుకున్న తరువాత ఎవరైనా పసుపు టీ త్రాగటం అలవాటు చేసుకుంటారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: