వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో వాడుతూనే ఉంటాం.  దానితో మనం తినే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌ గా కూడా వెల్లుల్లి పనిచేస్తుంది. ఇక రోజు తాగే పాలలో ఉడక పెట్టిన రెండు వెల్లుల్లి రెక్కలను తింటే దానివల్ల మన శరీరానికి ఎంతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

పాలలో వెల్లుల్లి రెబ్బల్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. 

అంతేకాకుండా చాల మందికి సమస్యగా మారిన  కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. తద్వారా పిల్లలకు మిక్కిలి పోషకాలు లభిస్తాయి. 

మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి ఈ వెల్లుల్లి పాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా నిద్ర చక్కగా పడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలతో కూడిన వెల్లుల్లిని ఉడకపెట్టి పాలతో కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అనేకమంది ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: