అలసట తగ్గించుకునేందుకు మనం తరుచూ తీసుకునే ఎనర్జీ డ్రింక్స్ వెనుక పొంచి ఉన్న ప్రమాదం తెలుసుకుంటే ఎవరైనా ఎనర్జీ డ్రింక్స్ ను ముట్టుకోవడానికి కూడ భయపడిపోతారు. జిమ్ లో కష్టమైన వర్కవుట్ చేసాక లేదా ఉద్యోగం నుంచి అలసిపోయి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరికైనా వెంటనే శక్తిని ఇచ్చే డ్రింక్ ను తీసేసుకోవాలనిపిస్తుంది. 

అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం శక్తినిచ్చే పానీయాలపై జరిగిన కొత్త విశ్లేషణలో బయటపడ్డ విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల మానసిక ఆరోగ్యసమస్యలు పెరిగిపోతాయి.  అంతేకాదు ఇవి రక్తపోటును స్థూలకాయాన్ని కిడ్నీలు పాడవటానికి సహకరిస్తాయి. 

ఈ ఎనర్జీ డ్రింక్స్ లో నీరు, చక్కెర, కెఫీన్, కొన్ని విటమిన్లు, ఖనిజలవణాలు మరియు కొన్ని పోషకాలు ఉన్నప్పటికీ ఇవి శరీరానికి ఎంతో హాని చేస్తాయి. ఈ ఎనర్జీ డ్రింక్ లోని కొన్ని విషపదార్ధాలు వల్ల మన జ్ఞాపసక్తి కూడ తగ్గిపోయే ఆస్కారం ఉందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అలసట తగ్గించుకోవడానికి తీసుకునే ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల కడుపునొప్పితో పాటు అనేక ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయని ఇటీవల ప్రచురితమైన ఒక సర్వ్ రిపోర్ట్ బయట పెట్టింది. 

వీటిని తరుచుగా తీసుకునే వారికి పళ్ళ పై తీవ్రప్రభావం పడి తొందరగా వారి పళ్ళు పుచ్చిపోతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను ఈ ఎనర్జీ డ్రింక్స్ విపరీతంగా పెంచుతాయి. ఎనర్జీ డ్రింక్స్ తాగటం వలన కడుపు లోపలిపొరలు పగిలిపోయి అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల వీలైనంత వరకు ఈ ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండమని అనేక పరిశోధనలు తెలియ చేస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: