ప్రస్తుతం ఆరోగ్యం గురించిన అవగాహన ప్రతి వ్యక్తిలోనూ బాగా పెరిగిపోతూ ఉండటంతో మనం తీసుకునే ఆహార పదార్ధాల విషయంలో కూడ అనేక జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. మన శరీర బరువు పెరగాలన్నా తగ్గాలన్నా ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని ప్రముఖ న్యూట్రీషియన్లు మరియు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆహారం నుండి విచ్చిన్నం కాబడే కొవ్వు మన శరీరంలో రోజురోజుకు పెరిగిపోతే ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీసే పరిస్థుతులు ఏర్పడతాయి.

మన శరీర బరువు పెరిగిపోతే ఆకారణం వల్ల కారణంగా కీళ్ల నొప్పి అలసట జీర్ణ సమస్యలు అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు గుండె జబ్బులు కాలేయ వ్యాధులు వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థుతులు ఏర్పడతాయి. ఈ ప్రమాదాల వల్ల చాలామంది కొవ్వును అధికంగా కలిగిన ఆహార పదార్ధాలను తినడం మానేస్తున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ వేయించిన వేపుళ్ళు తెల్లని బియ్యం, బంగాళాదుంప మొదలైన కొన్ని రకాల కూరగాయలతో పాటుగా నెయ్యిని కూడా దూరంగా ఉంచమని ఇప్పటి వరకు చాలామంది డాక్టర్లు చెపుతూ వచ్చారు. 

అయితే ఈమధ్య కొన్ని పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనలలో మన రోజువారి భోజనంలో కొద్దిపాటి నెయ్యను జోడించడం వల్ల మన శరీర బరువు క్షీణించే ప్రక్రియను వేగవంతం అవుతుందని లేటెస్ట్ అధ్యనాలు తెలియచేస్తున్నాయి. లేటెస్ట్ పరిశోధనా అధ్యయనాల నెయ్యిను తక్కువ పరిమాణంలో దాని స్వంత రూపంలోనే స్వచ్ఛమైన నెయ్యిగానే తీసుకున్నట్లయితే మన శరీర  బరువు తగ్గించే ప్రక్రియను మరింత వేగంగా చేయటానికి సహాయపడుతుంది అని కొందరు పాశ్చత్య వైద్యులు చెపుతున్నారు. 
అయితే నెయ్యితో చెయ్యబడిన తీపి పదార్థాలను మరియు ఇతర అధిక కేలరీలు గల ఆహారాలను తీసుకుంటే శరీర బరువు పెరగడంఖాయం అని అంటున్నారు.

స్వచ్చమైన నెయ్యిని కేవలం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మన జీవక్రియను పెంచవచ్చు. నెయ్యిలో, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల వంటివి మన జీవక్రియ రేటును మెరుగుపర్చడానికి సహాయపడతాయి తద్వారా కొవ్వు కణాలు వేగవంతంగా శక్తిగా మారటంలో సహాయపడతాయి. 
కాబట్టి ప్రతిరోజు  మీ భోజనంలో స్వచ్ఛమైన నెయ్యిని ఒక టీ స్పూను మోతాదులో జోడించడం వల్ల వేగంగా బరువు తగ్గటంలో సహాయపడుతుంది అదేవిధంగా మన మానసిక శక్తిని రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఈ నెయ్యి ఎంతగానో సహాయపడుతుందని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: